భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇటీవల కాలంలో తిరుమలలో దర్శనాలు, గదులు ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో భక్తులను నమ్మబలికి మోసగించి డబ్బులు వసూలు చేస్తున్న విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టుగా తెలిపింది.

దీనిలో భాగంగా టీటీడీ విజిలెన్స్ వారి సహకారంతో, పోలీసుల సమన్వయంతో సోషయల్ మీడియాలో “శ్రావణ్ కళ తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం” ఐడీతో భక్తులను మోసగిస్తున్న చిత్తూరుజిల్లా పెనుమూరుకు చెందిన కామసాని పవన్ కుమార్ అలియాస్ నాగరాజు, బోడిరెడ్డి చెన్నకేశవులు అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
ఇటీవల సోషల్ మీడియాలో భక్తులను మోసగిస్తున్న ఉందంతాల దృష్ట్యా భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీ అధికారిక మాధ్యమాల ద్వారానే దర్శనాలు, గదులు బుక్ చేసుకోవాలని భక్తులను కోరుతోంది. ఎవరైనా తిరుమలలో దర్శనాలు, గదులు తీసి ఇస్తామని చెబితే నమ్మకూడదని భక్తులను తెలిపింది. అలాంటి వ్యక్తుల సమాచారం తెలిస్తే టీటీడీ విజిలెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నెంబర్ 9866898630కు ఫిర్యాదు చేయాల్సిందిగా తెలిపింది.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని తొలగింపు
మరోవైపు తిరుమలలోని లగేజీ సెంటర్‌లో నరసింహారెడ్డి అనే వ్యక్తి భక్తుల నుండి డబ్బులు వసూలు చేసినట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. సదరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుండి తొలగించడం జరిగింది. టీటీడీ లగేజీ డిపాజిట్ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. భక్తులెవ్వరూ తమ లగేజీ కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని టీటీడీ తెలియజేస్తోంది.
నిబంధనలను అతిక్రమించి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే విజిలెన్స్ కంట్రోల్ నెంబర్ : 9866898630కు ఫిర్యాదు చేయాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులకు ఇబ్బందులు కలిగించే అంశాలను టీటీడీ ఉపేక్షించడం లేదు. వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటుంది. భక్తులు కూడా మోసం చేసేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తోంది. ఎలాంటి సేవలైనా టీటీడీ అధికారికంగా, సంబంధిత అధికారుల ద్వారానే చేస్తుంది. మధ్యవర్తులు, సోషల్ మీడియాలో వచ్చేవాటిని నమ్మి భక్తులు మోసపోకూడదు.
{{/usCountry}}నిబంధనలను అతిక్రమించి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే విజిలెన్స్ కంట్రోల్ నెంబర్ : 9866898630కు ఫిర్యాదు చేయాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులకు ఇబ్బందులు కలిగించే అంశాలను టీటీడీ ఉపేక్షించడం లేదు. వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటుంది. భక్తులు కూడా మోసం చేసేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తోంది. ఎలాంటి సేవలైనా టీటీడీ అధికారికంగా, సంబంధిత అధికారుల ద్వారానే చేస్తుంది. మధ్యవర్తులు, సోషల్ మీడియాలో వచ్చేవాటిని నమ్మి భక్తులు మోసపోకూడదు.
{{/usCountry}}