Tirumala Srivani Ticket Changes : తిరుమల కొండపై కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతంగా సేవలందించేందుకు టీటీడీ పలు మార్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ‘శ్రీవాణి’ ట్రస్టుకి సంబంధించిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కేటాయింపు నిబంధనలలో టీటీడీ పాలకమండలి కొన్ని కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. టీటీడీ రోజుకు మొత్తం 1,500 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్‌లైన్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచుతోంది. వీటిలో 500 దర్శన టికెట్లను మూడు నెలల ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేలా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారు. అదేవిధంగా…. తిరుపతికి విమానాల్లో వచ్చే భక్తుల సౌకర్యార్థం రేణిగుంట (తిరుపతి) విమానాశ్రయంలోని కరెంట్ బుకింగ్ కౌంటర్ ద్వారా ప్రతిరోజూ 200 శ్రీవాణి టికెట్లను జారీ చేస్తున్నారు.
దాతల కోసం ప్రత్యేక కోటా
మిగిలిన 800 శ్రీవాణి దర్శన టికెట్లను ప్రతిరోజూ కరెంట్ బుకింగ్ కోటా కింద తిరుమలలో కేటాయిస్తున్నారు. అయితే… ఈ 800 టికెట్లలో ఒక ముఖ్యమైన మార్పును టీటీడీ ప్రవేశపెట్టింది. ఇప్పటికే శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10 వేల విరాళం చెల్లించి, దర్శన టికెట్ కోసం ఎదురుచూస్తున్న దాతల కోసం ఈ కోటా నుంచి ప్రతిరోజూ ప్రత్యేకంగా 300 టికెట్లను కేటాయించాలని నిర్ణయించారు. ఈ సరికొత్త సదుపాయం గత సంవత్సరం…. 2025 మే 1వ తేదీ నుంచి విరాళాలు చెల్లించి, అర్హులైన దాతలందరికీ వర్తించనుంది.
జూన్ 10 నుంచి అమలు.. దర్శన సమయాలు ఇవే!
ఈ నూతన విధానాన్ని వచ్చే జూన్ 10వ తేదీ నుంచి అమలులోకి తీసుకురానున్నారు. ఈ ప్రత్యేక కోటా కింద కేటాయించిన 300 టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
{{/usCountry}}ఈ నూతన విధానాన్ని వచ్చే జూన్ 10వ తేదీ నుంచి అమలులోకి తీసుకురానున్నారు. ఈ ప్రత్యేక కోటా కింద కేటాయించిన 300 టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
{{/usCountry}}విరాళం ఇచ్చిన దాతలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా బుక్ చేసుకున్న భక్తులకు అదే రోజు సాయంత్రం 4 గంటలకే శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నారు.
ఒకవేళ నిర్ణీత మధ్యాహ్నం 1 గంట సమయానికి ఈ ప్రత్యేక కోటాలో టికెట్లు మిగిలిపోతే.. వాటిని తిరిగి సాధారణ కరెంట్ బుకింగ్ కోటాలోనే కలిపేస్తారు. ఈ సరికొత్త మార్పుల విధానం రాబోయే 2027 మార్చి 31వ తేదీ వరకు నిరంతరాయంగా అమల్లో ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది.