అడవి తల్లి నమ్ముకుని జీవించే వేలాది ఆదివాసీ కుటుంబాలకు, అరకు లోయలోని కాఫీ రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీపి కబురు అందించింది. ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ (ఏపీ జీసీసీ) ద్వారా మరింత విస్తృతంగా ఉత్పత్తులను సేకరించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. దీనివల్ల గిరిజను సేకరించే అటవీ ఉత్పత్తులకు నిలకడైన మార్కెట్ సౌకర్యం లభించడమే కాకుండా వారి ఆర్థిక పురోగతికి బాటలు పడనున్నాయి.

టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు నాయకత్వంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో జీసీసీ నుంచి వివిధ రకాల ఉత్పత్తుల సేకరణకు సంబంధించి కీలక ఆమోదం లభించింది.
అరకు లోయలోని గిరిజన రైతులు పండించే నాణ్యమైన అరేబికా కాఫీ గింజల నుంచి తయారైన 7,200 కిలోల ప్రీమియం ఇన్స్టంట్ కాఫీ పౌడర్‌ను టీటీడీ కొనుగోలు చేయనుంది. కిలో రూ. 1,414.35 చొప్పున మొత్తం రూ. 1.01 కోట్ల విలువైన ఆర్డర్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. గతంలో ఉన్న రూ. 617.40 ధరకు ఇది రెట్టింపు కంటే ఎక్కువే అయినప్పటికీ, ఇందులో ఎలాంటి రోబస్టా కాఫీ కలపకపోవడం, భౌగోళిక గుర్తింపు కలిగి ఉండటం, అత్యంత నాణ్యమైనది కావడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
టీటీడీకి అవసరమైన 1.35 లక్షల కిలోల ఎండు మిరపకాయలను కిలో రూ. 219.45 చొప్పున కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం చెల్లిస్తున్న రూ. 274.60 కంటే ఇది 20 శాతం తక్కువ. దీనివల్ల టీటీడీకి భారీగా నిధులు ఆదా కానున్నాయి. ఇప్పటికే జీసీసీ నుంచి తీసుకుంటున్న 4,000 కిలోల తేనెను (కిలో రూ. 437.85), 1,000 కిలోల కుంకుడు కాయల పొడిని (కిలో రూ. 218.40) యథావిధిగా కొనుగోలు చేస్తారు.
జీసీసీ నిర్వహించిన టెండర్ ధరల ప్రకారం 75,000 కిలోల జీడిపప్పును సేకరిస్తారు. ఇందులో ఆలు జీడిపప్పు (Whole Cashew) కిలో రూ. 847.79 కాగా, బద్ద జీడిపప్పు (Split Cashew) కిలో రూ. 911గా నిర్ణయించారు. టీటీడీ వార్షిక అవసరం 11 లక్షల కిలోలు కాగా, మిగిలిన మొత్తాన్ని బహిరంగ టెండర్ల ద్వారా సేకరిస్తారు.
{{/usCountry}}జీసీసీ నిర్వహించిన టెండర్ ధరల ప్రకారం 75,000 కిలోల జీడిపప్పును సేకరిస్తారు. ఇందులో ఆలు జీడిపప్పు (Whole Cashew) కిలో రూ. 847.79 కాగా, బద్ద జీడిపప్పు (Split Cashew) కిలో రూ. 911గా నిర్ణయించారు. టీటీడీ వార్షిక అవసరం 11 లక్షల కిలోలు కాగా, మిగిలిన మొత్తాన్ని బహిరంగ టెండర్ల ద్వారా సేకరిస్తారు.
{{/usCountry}}జీసీసీ ప్రతిపాదించిన కొన్ని ఉత్పత్తుల ధరలు ప్రస్తుతం టీటీడీ కొనుగోలు చేస్తున్న రేట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. పసుపు పొడి (40,000 కిలోలు) - ప్రస్తుతం రూ. 144 ఉండగా జీసీసీ రేటు రూ. 201.60. కారం పొడి (33,000 కిలోలు) - ప్రస్తుతం రూ. 239.75 ఉండగా జీసీసీ రేటు రూ. 257.25. కుంకుమ (24,000 కిలోలు) - ప్రస్తుతం రూ. 180 ఉండగా జీసీసీ రేటు రూ. 225.75.
ఈ ధరలను తగ్గించేందుకు జీసీసీ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని టీటీడీ కొనుగోలు కమిటీ సూచించింది. అయితే గిరిజనుల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వ సంస్థ కావడంతో, సంప్రదింపుల అనంతరం వీటి కొనుగోలును కూడా పరిశీలించవచ్చని తెలిపింది.
మొత్తంగా ఏడాదికి రూ. 12.97 కోట్ల విలువైన ఉత్పత్తులను జీసీసీ నుంచి కొనుగోలు చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తెలిపారు. బోర్డు ఆమోదానికి ముందే టీటీడీ ల్యాబొరేటరీలో ఈ ఉత్పత్తుల శాంపిల్స్‌ను పరీక్షించగా, అవి అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని తేలింది. జీసీసీ కూడా తమ సొంత ల్యాబ్ నివేదికలను సమర్పించి నాణ్యతను ధృవీకరించింది.