తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన సోమవారం ఉదయం రథోత్సవం కన్నులపండుగగా జరిగింది. ఉదయం 09.15 గంటలకు ధనుర్ లగ్నంలో రథోత్సవం మొదలై ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం.

రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు, భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం అని ప్రకటనలో టీటీడీ పేర్కొంది. రథోత్సవం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి అమ్మవారికి రథమండపంలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకరించారు. రాత్రి అశ్వవాహనంపై అమ్మవారు దర్శనం ఇస్తారు.
మరోవైపు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 25వ తేదీ పంచమీ తీర్థానికి టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. పంచమీ తీర్థం నిర్వహణకు అవసరమైన క్యూలైన్లు, బ్యారీకేడ్లు, పద్మపుష్కరిణిలోనికి ప్రవేశ, నిష్క్రమణ గేట్లు, సూచిక బోర్డులు తదితర ఇంజినీరింగ్ పనులు పూర్తయ్యాయి. తిరుచానూరుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ భద్రత, నిఘా విభాగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా టిటిడి భద్రతా సిబ్బంది 600 మంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ 200, ఎన్.సి.సి.విద్యార్థులు 200, శ్రీవారి సేవకులు 900, పోలీస్ సిబ్బంది 1600 మందితో భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
భక్తుల సౌకర్యార్థం దాదాపు 150 అన్నప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. తోళ్ళప్ప గార్డన్స్లో 50, ఎస్వీ హైస్కూల్ వద్ద -15, శ్రీ అయప్పస్వామివారి (నవజీవన్ ఆసుపత్రి)ఆలయం వద్ద – 45, పూడి ఏరియాలో – 25., గేట్ – 4లో ఎమర్జెన్సీ – 15 అన్నప్రసాదం కౌంటర్లలో పంపిణీ చేస్తారు. అదేవిధంగా క్యూలైన్లలోని భక్తులకు అవసరమైన త్రాగునీరు, అల్పాహరం, అన్నప్రసాదాలు, మజ్జిగ పంపిణీ చేస్తారు.
{{/usCountry}}భక్తుల సౌకర్యార్థం దాదాపు 150 అన్నప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. తోళ్ళప్ప గార్డన్స్లో 50, ఎస్వీ హైస్కూల్ వద్ద -15, శ్రీ అయప్పస్వామివారి (నవజీవన్ ఆసుపత్రి)ఆలయం వద్ద – 45, పూడి ఏరియాలో – 25., గేట్ – 4లో ఎమర్జెన్సీ – 15 అన్నప్రసాదం కౌంటర్లలో పంపిణీ చేస్తారు. అదేవిధంగా క్యూలైన్లలోని భక్తులకు అవసరమైన త్రాగునీరు, అల్పాహరం, అన్నప్రసాదాలు, మజ్జిగ పంపిణీ చేస్తారు.
{{/usCountry}}ఇందులో భాగంగా 284 శాశ్వత, తాత్కాలికం, మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఇందుకు అవసరమైన అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు. అమ్మవారి దర్శన సమయం, అన్నప్రసాదాలు, మరుగుదొడ్లు, పార్కింగ్ తదితర ప్రాంతాలను భక్తులు సులభంగా గుర్తించేందుకు వీలుగా వివిధ ప్రాంతాలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.