...
...
Next Story

SVIMS : ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్ విద్యార్థులకు ఊరట.. 4½ సంవత్సరాలకే ఫీజులు

NRI MBBS Students : ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్ విద్యార్థులకు ఊరట కల్పించనుంది స్విమ్స్ - శ్రీ పద్మావతీ మహిళా మెడికల్ కాలేజీ. ట్యూషన్ ఫీజులను ఐదేళ్లకు కాకుండా.. నాలుగున్నర ఏళ్లకే వసూలు చేయనుంది.

Updated on: Apr 17, 2026, 22:16:43 IST
Advertisement

స్విమ్స్ - శ్రీ పద్మావతీ మహిళా మెడికల్ కాలేజీలో 2021-22 బ్యాచ్ ఎంబీబీఎస్ కోర్సుకు ట్యూషన్ ఫీజులను ఐదు సంవత్సరాలకు కాకుండా 4½ సంవత్సరాలకే వసూలు చేయాలని నిర్ణయించారు. 2021-22 బ్యాచ్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇటీవల టీటీడీ ఈవోను కలిశారు. తమ కోర్సు వ్యవధి 4½ సంవత్సరాలు మాత్రమే కావడంతో అదే మేరకు ఫీజులు వసూలు చేయాలని టీటీడీ ఈవో ఎం.రవిచంద్రకు విజ్ఞప్తి చేశారు. స్విమ్స్ - శ్రీ పద్మావతీ మహిళా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సుకు ట్యూషన్ ఫీజులను 5 సంవత్సరాలకు వసూలు చేస్తున్నట్లు వారు వినతి పత్రం సమర్పించారు.

స్విమ్స్
స్విమ్స్

ఈ అంశాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో, నేషనల్ మెడికల్ కమిషన్ 07-04-2026న జారీ చేసిన నిబంధనలను పరిశీలించి, ఎన్‌ఆర్‌ఐ ఎంబీబీఎస్ కోర్సుకు ఫీజులు 4½ సంవత్సరాలకే వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు స్విమ్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో చర్చించి, తగిన ఆమోదం (రాటిఫికేషన్) పొందేందుకు చర్యలు తీసుకోనున్నారు.

ప్రస్తుతం 2021-22బ్యాచ్ విద్యార్థులు చివరి సంవత్సరంలో ఉండటంతో వారికి 5 సంవత్సరాలకంటే 4½ సంవత్సరాలకే ఫీజులు వర్తింపజేయాలని నిర్ణయించారు. ఇదే విధానం ఇకపై వచ్చే తదుపరి బ్యాచ్‌లకు కూడా అమలు కానుంది.

తిరుపతి స్విమ్స్‌లో చదివే ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ విద్యార్థులకు ఈ నిర్ణయంతో ఊరట దక్కనుంది. ఇప్పచిదాకా ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ విద్యార్థులు ఐదేళ్లకు ట్యూషన్ ఫీజులు చెల్లిస్తున్నారు. అయితే విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు స్వి్మ్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ దీనిపై చర్చించింది. చివరకు ట్యూషన్ ఫీజును 5 సంవత్సరాలకు కాకుండా నాలుగున్న ఏళ్లకే చెల్లించాలని నిర్ణయించింది.

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(SVIMS) ప్రముఖ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వైద్య విశ్వవిద్యాలయం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆధ్వర్యంలో నడుస్తుంది. 24/7 అత్యవసర సేవలు, ఆధునిక పరికరాలతో మెరుగైన వైద్య సేవలను అందిస్తుంది. ఇక్కడ క్యాన్సర్ చికిత్స, జనరల్ మెడిసిన్, ఇతర ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks