...
...
Next Story

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు

తిరుమలలో డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి భ‌క్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ప్రకటన చేశారు. ఇందు కోసం ఆఫ్‌లైన్‌, ఆన్ లైన్ టోకెన్ల జారీ విధి విధానాలు త్వరలో తెలియజేస్తామని తెలిపారు.

Published on: Nov 7, 2025, 16:21:25 IST
Advertisement

తిరుమల శ్రీవారి భక్తులకు కీలక అప్డేట్ వచ్చేసింది. శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇందుకోసం ఆఫ్‌లైన్‌, ఆన్ లైన్ టోకెన్ల జారీ విధి విధానాలు త్వరలో తెలియజేస్తామన్నారు.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

శ‌నివారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో…. 17 మంది భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. శ్రీవారి భక్తుల విజ్ఞప్తి మేరకు అంగప్రదక్షిణ టోకెన్ల జారీని డిప్‌ విధానం నుంచి మార్చినట్లు వివరించారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆన్‌లైన్‌ కోటా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

తిరుప‌తిలో రోజుకు 20 వేల సర్వదర్శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయని ఈవో తెలిపారు. ఆన్ లైన్ లో కోటా పెంచ‌డం వీలు ప‌డ‌దని ఓ భక్తుడు అడిగిన ప్రశ్నకు ఈవో జవాబునిచ్చారు. 2023లో ఇంజినీరింగ్ విభాగంలో ఉద్యోగాల‌కు నియామాకాలపై స్పందించిన ఈవో… 15 రోజుల్లో ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామని క్లారిటీ ఇచ్చారు.

ఎస్ఎస్ డి టోకెన్ల జారీ సమయం మార్పుపై కమిటీ పరిశీలిస్తుందని ఈవో సింఘాల్ వివరించారు. హోమం టికెట్లు మొత్తం కుటుంబానికి కేటాయించే విషయం పరిశీలిస్తామన్నారు. విఐపి లకు కేటాయించే దర్శన సమయం తక్కువ, సామాన్య భక్తులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నామని మరో ప్రశ్నకు జవాబునిచ్చారు. శ్రీవారి సేవకురాలిగా కాల్ సెంటర్ లో సేవలు అందించేందుకు త్వరలో విధివిధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe