...
...
Next Story

దక్షిణ మధ్య రైల్వేలో అరుదైన రికార్డు - వెల్దుర్తి గూడ్స్ షెడ్ నుంచి ముడి ఇనుము లోడ్‌! ఇదే తొలిసారి

భారతదేశ మల్టీమోడల్ లాజిస్టిక్స్ బలోపేతంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని వెల్దుర్తి గూడ్స్ షెడ్ కొత్త మైలురాయిని అందుకుంది. ఇక్కడి నుంచి 2,670 టన్నుల ముడి ఇనుము లోడ్‌తో పంజాబ్‌లోని ఫిల్లూర్ ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోకు తొలి కంటైనర్ రైలు బయలుదేరింది.

Published on: Jun 30, 2026, 13:21:21 IST
Advertisement

దేశీయ సరకు రవాణా రంగాన్ని బలోపేతం చేస్తూ…. మల్టీమోడల్ లాజిస్టిక్స్ (బహుళ రవాణా అనుసంధానత) వ్యవస్థ విస్తరణలో దక్షిణ మధ్య రైల్వే ఒక కీలక మైలురాయిని అధిగమించింది. పునర్వ్యవస్థీకరించిన దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే ఆంధ్రప్రదేశ్‌లోని వెల్దుర్తి గూడ్స్ షెడ్ నుంచి తొలిసారిగా ముడి ఇనుము (పిగ్ ఐరన్) లోడ్ చేసిన సరికొత్త కంటైనర్ రైలును రైల్వే అధికారులు విజయవంతంగా ప్రారంభించారు.

ఇదే తొలిసారి…

వెల్దుర్తి గూడ్స్ షెడ్ నుంచి ముడి ఇనుము లోడ్‌
వెల్దుర్తి గూడ్స్ షెడ్ నుంచి ముడి ఇనుము లోడ్‌

వెల్దుర్తి గూడ్స్ షెడ్ నుంచి బయలుదేరిన ఈ మొదటి కంటైనర్ రేక్ ద్వారా ఏకంగా 2,670 టన్నుల ముడి ఇనుమును పంజాబ్ రాష్ట్రంలోని ఫిల్లూర్ ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోకు (ICD) రవాణా చేశారు. ఈ ఒకే ఒక్క సరకు రవాణా ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు దాదాపు రూ.59 లక్షల అంచనా ఆదాయం సమకూరడం విశేషం.

దేశీయ కంటైనర్ రవాణాను భారీగా ప్రోత్సహించే లక్ష్యంతో వెల్దుర్తి గూడ్స్ షెడ్‌ను 'ప్రత్యేక కంటైనర్ రైల్ టెర్మినల్' గా ఈ నెల 10వ తేదీన రైల్వే బోర్డు నోటిఫై చేసింది. హైదరాబాద్ డివిజన్‌లోనే ప్రత్యేక కంటైనర్ రైల్ టెర్మినల్‌గా గుర్తింపు పొందిన ఈ వెల్దుర్తి గూడ్స్ షెడ్.. భవిష్యత్తులో దక్షిణ మధ్య రైల్వే ఆర్థిక పురోగతికి విశేషంగా దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాన్‌కార్) ఈ టెర్మినల్ ప్రాధాన్యతను గుర్తించి, ఇక్కడి నుంచి ప్రతి నెలా మూడు కంటైనర్ రేక్లను లోడింగ్ చేసేందుకు అధికారికంగా అంగీకరించింది.

ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (GM) సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. తొలి కంటైనర్ లోడింగ్‌ను అత్యంత సమర్థవంతంగా, విజయవంతంగా సాధించినందుకు హైదరాబాద్ డివిజన్ రైల్వే అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ టెర్మినల్ అందుబాటులోకి రావడం వల్ల ఈ ప్రాంతంలోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు మరింత వేగవంతమైన, కస్టమర్-కేంద్రీకృత లాజిస్టిక్స్ సేవలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks