...
...
Next Story

వియత్నాం బోటు ప్రమాదం.. తిరిగొస్తున్న తెలుగు పర్యాటకులు.. మృతదేహాల తరలింపునకు ఏర్పాట్లు

వియత్నాంలో భారతీయ టూరిస్ట్‌ల బోటు బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది వరకు చనిపోయారు. తెలుగు పర్యాటకులు కూడా ఇందులో ఉన్నారు.

Published on: Jul 12, 2026, 16:21:36 IST
Advertisement

వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ పర్యాటకుల భౌతికకాయాలను స్వదేశానికి తీసుకువచ్చే ప్రక్రియ వేగవంతమైంది. ఈ ఘోర ప్రమాదంలో గాయపడిన పర్యాటకుడు గెల్లా కిషోర్ ప్రస్తుతం వియత్నాంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోందని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

వియత్నాం బోటు ప్రమాదం
వియత్నాం బోటు ప్రమాదం

ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన తెలుగు పర్యాటకులు ఆదివారం (జూలై 12, 2026) రాత్రికల్లా భారతదేశానికి చేరుకోనున్నారు. ఫు క్వాక్ ద్వీపంలో చిక్కుకుపోయిన పర్యాటకులందరూ ఇప్పటికే హనోయిలోని నోయి బాయి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరంతా స్థానిక సమయం ప్రకారం రాత్రి 7.05 గంటలకు వియత్నాం ఎయిర్‌లైన్స్ విమానంలో బయలుదేరి, భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరుకుంటారని అధికారులు వెల్లడించారు. బాధితుల ప్రయాణానికి సంబంధించిన విమాన టిక్కెట్లను సదరు మొబైల్ సేవా సంస్థ సమకూర్చింది.

ఈ ప్రమాదంలో మరణించిన 15 మంది భారతీయ పర్యాటకుల భౌతికకాయాలను హో చి మిన్ సిటీకి తరలిస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి మృతదేహాలు అక్కడికి చేరుకుంటాయి. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) భౌతికకాయాల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించడానికి ఒక అథరైజ్డ్ ఏజెన్సీ ఖరారు చేసింది.

భౌతికకాయాలను భారతదేశానికి తరలించేందుకు అవసరమైన అధికారిక పత్రాలు, అనుమతుల కోసం ఈ సంస్థ బాధిత కుటుంబాలను సంప్రదించనుంది. హో చి మిన్ సిటీలో అన్ని ఫార్మాలిటీస్ పూర్తికాగానే, మృతదేహాలను వారి స్వగ్రామాలకు చేర్చడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

ఓ మొబైల్‌ కంపెనీ భారత్‌ నుంచి తమ డిస్ట్రిబ్యూటర్లను కుటుంబాలను వియత్నాం ట్రిప్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన వారిలో ఏపీ, తెలంగాణ నుంచి కూడా పలువురు ఉన్నారు. ట్రిప్‌లో భాగంగా వీరు మూడు పడవల్లో సముద్రంలో విహార యాత్రకు వెళ్లారు. చనిపోయినవారిలో పలువురు తెలుగు వారు ఉన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe