Markapuram Accident : డీఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతదేహాల గుర్తింపు - స్వస్థలాలకు తరలింపు

Markapuram Accident Updates: మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలోని మృతదేహాలను గుర్తించారు. డీఎన్ఏ ఫలితాల ఆధారంగా గుర్తించగా… ఇవాళ అంబులెన్సుల ద్వారా వారి స్వస్థలాలకు తరలిస్తారు. 

Published on: Mar 28, 2026, 09:18:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. అయితే వారి మృతదేహాలను గుర్తుపట్టలేని విధంగా ఉండగా… డీఎన్ఏ పరీక్షలతో గుర్తించారు.

దగ్ధమైన ట్రావెల్స్ బస్సు
దగ్ధమైన ట్రావెల్స్ బస్సు

మార్కాపురం జీజీహెచ్ లో పోస్టుమార్టం నిర్వహించినప్పటికీ మృతదేహాలు ఎవరివో గుర్తించలేకపోయారు. గురువారం రాత్రి తోబుట్టువుల (మొత్తం 22 మంది) నుంచి గుంటూరు రీజినల్ పోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఆర్ఎస్ఎస్ఎల్) నిపుణులు రక్త నమూనాలు సేకరించారు.తోబుట్టువుల నుంచి సేకరించిన నమూనాలను ల్యాబ్ లో పరీక్షించారు. శుక్రవారం రాత్రి వరకు ఈ వెలువడ్డాయి. వీటి ఆధారంగా మృతదేహాల గుర్తింపు కార్డులోని వివరాలతో అనుసంధానం చేశారు.

శనివారం ఉదయం నుంచి తోబుట్టవులకు మృతదేహాలను అప్పగిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసే అంబులెన్సుల ద్వారా స్వస్థలాలకు మృతదేహాలను ఎస్కార్ట్ సాయంతో పంపనున్నారు.కందుకూరు. కనిగిరి, ఒంగోలు, నెల్లూరు జిల్లా బుచ్చి వరకు మృతదేహాల తరలింపు జరగనుంది.

తగిన జాగ్రత్తలతో..!

డీఎన్ఏ పరీక్షల నిర్వహణలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. చనిపోయిన వారి తోబుట్టవుల (రక్త సంబంధీకులు) నుంచి నమూనాలు సేకరించారు. ఒక కేసు విషయంలో తండ్రి, బిడ్డ చనిపోయారు. తండ్రిని ఆయన తల్లిదండ్రుల నుంచి సేకరించిన రక్త నమూనాలు, బిడ్డ విషయంలో తల్లి నుంచి సేకరించిన నమూనాను పరీక్షించడం ద్వారా వారి మృతదేహాల గుర్తింపు సాధ్యమైంది.

బస్సు ప్రమాదంలో గాయపడిన 20 మంది… ఒంగోలు, మార్కాపురం అసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒంగోలు జీజీహెచ్లో 16 మంది, మార్కాపురం జీజీహెచ్లో 12 మంది, ప్రైవేటు ఆసుపత్రిలో ఒకరు చొప్పున చికిత్స పొందుతున్నారని వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

ఒంగోలు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి కాళ్లకు శుక్రవారం శస్త్ర చికిత్స చేశారు. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పద్మావతి, ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి టి వెంకటేశ్వర్లు, మార్కాపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ వెల్లడించారు. వైద్యుల వైద్యుల సూచనలు అనుసరించి కోలుకున్న వారిని డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. చికిత్స, ఆరోగ్య పరిస్థితులపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More