...
...
Next Story

Vijayawada Bypass Traffic : విజయవాడ బైపాస్‌పై ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్‌లలో వెళ్లాలి!

Vijayawada Bypass Traffic : విజయవాడ బైపాస్ రహదారిపై ప్రయాణించే వారికి అలర్ట్. నవంబర్ 21, 22 తేదీల్లో బైపాస్‌పై వాహనాల రాకపోకలకు అంతరాయం ఉండనుంది.

Published on: Nov 21, 2026, 10:04:07 IST
Advertisement

విజయవాడలోని పాముల కాలువ జంక్షన్ వద్ద వెస్ట్ బైపాస్ నిర్మాణ పనుల్లో భాగంగా, విద్యుత్ తీగలను తొలగించేందుకు వీలుగా శనివారం, ఆదివారం నాడు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నట్లు విజయవాడ పోలీసులు తెలిపారు. విజయవాడ గ్రామీణ మండల పరిధిలోని అంబాపురం వద్ద హైటెన్షన్ విద్యుత్ టవర్ల మార్పిడి పనులు జరుగుతున్నాయి. పనుల కారణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు విజయవాడ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు, డీసీపీ (ట్రాఫిక్) షిరీన్ బేగం పర్యవేక్షణలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి.

ఏలూరు నుండి వెస్ట్ బైపాస్ మీదుగా హైదరాబాద్, గుంటూరు వైపు వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలి. గుంటూరు వైపు వెళ్లే వాహనాలు చిన్న అవుటపల్లి, రామవరప్పాడు మీదుగా వెళ్లి వారధిని ఉపయోగించుకోవాలి. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ మీదుగా ప్రయాణించాలి.

గుంటూరు, హైదరాబాద్ నుండి ఏలూరు వైపు వచ్చే వాహనాలు గొల్లపూడి నల్లకుంట రింగ్ నుండి గొల్లపూడి వై-జంక్షన్ (Y Junction), సీవీఆర్ ఫ్లైఓవర్, పైప్‌లైన్ రోడ్డు, కండ్రిక సెంటర్, నున్న పవర్ గ్రిడ్ మీదుగా వెళ్ళి వెస్ట్ బైపాస్‌ను చేరుకోవాలి.

మైలవరం నుండి విజయవాడ వైపు వచ్చే వాహనాలు పాముల కాలువ సెంటర్ నుండి అంబాపురం గ్రామం, పి. నైనవరం, పాముల కాలువ వెస్ట్ బైపాస్ మీదుగా ప్రయాణించి వై.వి.రావు ఎస్టేట్ ద్వారా నగరంలోకి ప్రవేశించాలి.

ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు, వాహనదారులు తమ ప్రయాణ ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని, ట్రాఫిక్ సిబ్బంది ఇచ్చే సూచనలను పాటించాలని పోలీసులు కోరారు.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks