...
...
Next Story

విజయవాడ కనకదుర్గ గుడి ఘాట్ రోడ్డు క్లోజ్.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!

విజయవాడ కనకదుర్గ గుడి ఘాట్ రోడ్డు కొన్ని రోజులపాటు మూసివేయనున్నారు. మరమ్మతుల కారణంగా దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

Published on: May 27, 2026, 21:01:05 IST
Advertisement

విజయవాడ కనక దుర్గమ్మ గుడికి వచ్చే భక్తులకు అలర్ట్. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఘాట్ రోడ్డును మే 28వ తేదీ (గురువారం) నుంచి పూర్తిగా మూసివేస్తున్నట్లు ఆలయ ఈఓ వి.కె. సీనా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఘాట్ రోడ్డులో అత్యవసర మరమ్మతు పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

విజయవాడ దుర్మమ్మ గుడి
విజయవాడ దుర్మమ్మ గుడి

ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో ఈ ఘాట్ రోడ్డు మరమ్మతు పనులు జరగనున్నాయి. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వచ్చే 15 రోజుల పాటు ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఈఓ స్పష్టం చేశారు. అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఘాట్ రోడ్డు మూసివేసిన నేపథ్యంలో భక్తులు ఇంద్రకీలాద్రి పైకి చేరుకోవడానికి శ్రీ కనకదుర్గ నగర్ వైపు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అనుమతించనున్నారు.

ఘాట్ రోడ్డులో ఉన్న ప్రస్తుత ప్రోటోకాల్ కార్యాలయాన్ని తక్షణమే కొండ దిగువన కొత్తగా నిర్మించిన శ్రీ కనకదుర్గ నగర్ భవనంలోకి మారుస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఈ కొత్త ప్రోటోకాల్ ఆఫీస్ నుండి దేవస్థానం ఉచిత బ్యాటరీ వాహనాలను నడపనుంది.

భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి, తోపులాటలు జరగకుండా ప్రోటోకాల్ ఆఫీస్ నుండి మహా మండపం వరకు అదనపు సిబ్బందిని, సెక్యూరిటీ గార్డులను నియమించారు. ప్రోటోకాల్ భక్తుల కోసం మహా మండపం వద్ద ప్రత్యేక దర్శన పాయింట్‌ను ఏర్పాటు చేశారు. అలాగే నిత్య పూజలు, సేవలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

భక్తుల వాహనాల కోసం మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణంలో ప్రత్యామ్నాయ పార్కింగ్ సౌకర్యం కల్పించారు. సీతమ్మవారి పాదాలు, కుమ్మరిపాలెం సెంటర్, పున్నమి ఘాట్‌ల నుండి భక్తులను ఆలయానికి చేరవేసేందుకు దుర్గగుడి ఉచిత బస్సులు నిరంతరాయంగా నడుస్తాయి.

ఇంద్రకీలాద్రిపై ఉన్న లిఫ్ట్ సౌకర్యాన్ని కేవలం వృద్ధులు, దివ్యాంగులు, పసిపిల్లలతో ఉన్న తల్లులకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు ఈఓ సీనా నాయక్ స్పష్టం చేశారు. మిగిలిన సాధారణ భక్తులందరూ మహా మండపం మెట్ల మార్గం ద్వారానే కొండపైకి వెళ్లాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe