విశాఖపట్నం నగర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఒక బృహత్తర ప్రణాళిక సిద్ధమవుతోంది. విశాఖను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ ఒక సమగ్ర ఇంటిగ్రేటెడ్ ఎకో-టూరిజం డెవలప్‌మెంట్ ప్లాన్(Integrated Eco-Tourism Development Plan)ను విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్ ప్రతిపాదించారు. నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన కైలాసగిరి, ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ (జూ పార్క్), కంబాలకొండ వన్యప్రాణి అభయారణ్యాన్ని ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ ఈ భారీ ప్రాజెక్టును చేపట్టనున్నారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక ప్రతిపాదనలపై విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఎంపీ శ్రీభరత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్, జిల్లా అటవీ అధికారి(DFO) రవీంద్ర ధామా, జూ క్యూరేటర్ మంగమ్మలతో పాటు అంతర్జాతీయ డిజైనింగ్ సంస్థలైన సింగపూర్‌కు చెందిన 'మాండై' (Mandai), బెంగళూరుకు చెందిన 'ఇంటిగ్రేటెడ్ డిజైన్' ప్రతినిధులు పాల్గొన్నారు.
విశాఖపట్నం సహజసిద్ధమైన భౌగోళిక అందాలు, సముద్ర తీరం, కొండలతో పర్యావరణ పర్యాటకానికి ఎంతో అనుకూలమైనదని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పర్యాటకులను ఆకర్షించేందుకు పలు కీలక ప్రతిపాదనలు చేశారు. విశాఖలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో నైట్ సఫారీని ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. కైలాసగిరి, కంబాలకొండ వంటి ప్రకృతి రమణీయ ప్రాంతాలలో పర్యాటకులను అలరించేందుకు అదనపు సాహస క్రీడల వసతులను అభివృద్ధి చేయాలని సూచించారు.
పర్యాటకుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన రోడ్లు, రవాణా, వ్యూ పాయింట్లు వంటి మౌలిక సదుపాయాలను అంచనా వేయాలన్నారు శ్రీభరత్. పర్యావరణ చట్టాలకు లోబడి, ప్రకృతికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ ప్రాజెక్ట్ డిజైన్ ఉండాలని ఎంపీ స్పష్టం చేశారు.
అటవీ శాఖ, వీఎంఆర్‌డీఏ, పర్యాటక శాఖ, జీవీఎంసీ అధికారులు సంయుక్తంగా సమన్వయం చేసుకుంటూ ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. మొదటి దశగా స్థానిక ప్రజల, పర్యాటకుల అవసరాలను గుర్తించి ప్రతిపాదనలు రూపొందించాలని, దీనికి సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ త్వరలోనే సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే ఏపీ పర్యాటక రంగంలోనే విశాఖ సరికొత్త మైలురాయిగా నిలవనుంది.
{{/usCountry}}అటవీ శాఖ, వీఎంఆర్‌డీఏ, పర్యాటక శాఖ, జీవీఎంసీ అధికారులు సంయుక్తంగా సమన్వయం చేసుకుంటూ ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. మొదటి దశగా స్థానిక ప్రజల, పర్యాటకుల అవసరాలను గుర్తించి ప్రతిపాదనలు రూపొందించాలని, దీనికి సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ త్వరలోనే సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే ఏపీ పర్యాటక రంగంలోనే విశాఖ సరికొత్త మైలురాయిగా నిలవనుంది.
{{/usCountry}}