...
...
Next Story

ఏపీ ప్రయాణికులకు శుభవార్త... వైజాగ్ - బెంగళూరు ప్రత్యేక రైళ్లు పొడిగింపు

Visakhapatnam Bengaluru Special Trains : విశాఖపట్నం - ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులను దక్షిణ కోస్తా రైల్వే పొడిగించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 2026 చివరి వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.

Published on: Jul 6, 2026, 13:23:45 IST
Advertisement

Visakhapatnam Bengaluru Special Trains : రైలు ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే (South Coast Railway) తీపి కబురు అందించింది. విశాఖపట్నం - ఎస్ఎంవీటీ బెంగళూరు (SMVT Bengaluru) స్టేషన్ల మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల అదనపు రద్దీని నియంత్రించేందుకు మరియు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

  • రైలు నంబర్ 08581 (విశాఖపట్నం - SMVT బెంగళూరు) : ప్రతి వారం శుక్రవారం నాడు నడిచే ఈ ప్రత్యేక రైలు సర్వీసులను 2026 ఆగస్టు 7 నుంచి 2026 సెప్టెంబర్ 25 వరకు పొడిగించారు.
  • రైలు నంబర్ 08507 (SMVT బెంగళూరు - విశాఖపట్నం): ప్రతి వారం శనివారం నాడు తిరుగు ప్రయాణమయ్యే ఈ రైలు సర్వీసులను 2026 ఆగస్టు 8 నుంచి 2026 సెప్టెంబర్ 26 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

వైజాగ్ - బెంగళూరు ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు
వైజాగ్ - బెంగళూరు ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు

ఈ ప్రత్యేక రైళ్లు(ఇరువైపుల) విశాఖ దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, సామల్ కోట జంక్షన్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, గూడూరు, రేణిగుంట మీదుగా వెళ్తాయి. ప్రస్తుతం నడుస్తున్న పాత వేళలు, స్టాపేజీలు, కోచ్ల అమరిక మెయింటెనెన్స్ పద్ధతుల ప్రకారమే యథావిధిగా కొనసాగుతాయని దక్షిణ కోస్తా రైల్వే స్పష్టం చేసింది. బెంగళూరు, వైజాగ్ మార్గాల్లో ప్రయాణించే వారు ఈ పొడిగించిన సర్వీసులను గమనించి…. తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe