రాబోయే 2 నెలల్లో నాలుగు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న వైజాగ్!

రాబోయే రెండు నెలల్లో వైజాగ్ క్రికెట్ స్టేడియంలో నాలుగు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

Published on: Nov 30, 2025, 22:25:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాబోయే రెండు నెలల్లో భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు పాల్గొనే నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌లకు విశాఖపట్నం రెడీగా ఉంది. ఈ మ్యాచ్‌లన్నీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. డిసెంబర్ 6న భారతదేశం, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న మూడో ఇంటర్నేషనల్ వన్డే మ్యాచ్ మొదటిది. రెండు జట్లు డిసెంబర్ 4న వైజాగ్‌కు చేరుకుంటాయి. డిసెంబర్ 5న ప్రాక్టీస్ సెషన్‌లు జరగుతాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఆ తర్వాత వైజాగ్ క్రికెట్ స్టేడియంలో డిసెంబర్ 21, డిసెంబర్ 23 తేదీలలో భారత్, శ్రీలంక మధ్య రెండు మహిళల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అనంతరం జనవరి 28, 2026న సాయంత్రం 7 గంటలకు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ నాల్గో టీ20 మ్యాచ్‌ ఉంటుంది. ఇలా రెండు నెలల్లో వైజాగ్ క్రికెట్ స్టేడియంలో నాలుగు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించడానికి ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా క్రికెట్ స్టేడియంలో ఇటీవలే పునర్నిర్మాణాలు చేశారు. ఈ స్టేడియం ప్రస్తుతం 25,000 మంది ప్రేక్షకులను సామర్థ్యాన్ని కలిగి ఉంది. సామర్థ్యాన్ని 36,000 మందికి పెంచే ప్రణాళికలు ఉన్నాయి.

ఇటీవలి మౌలిక సదుపాయాల మెరుగుదలలలో 34 హాస్పిటలిటీ బాక్సులు, 250 టాయిలెట్ సౌకర్యాలు, అధునాతన అగ్నిమాపక భద్రతా వ్యవస్థలు, ఒకేసారి 64 మందిని రవాణా తీసుకెళ్లగలిగే నాలుగు అధిక సామర్థ్యం గల లిఫ్ట్‌లు ఉన్నాయి. నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు గర్వకారణమైన క్షణం అని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ చెప్పారు. స్టేడియంలో ప్రేక్షకులకు ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నామన్నారు.

వైజాగ్ క్రికెట్ స్టేడియంలో అన్ని మ్యాచ్‌లు సజావుగా జరిగేలా చూసేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తోంది. క్రికెట్ ప్రేమికులు ముందుగానే టిక్కెట్లు కొనుగోలు చేయాలని, ప్రవేశ మార్గదర్శకాలను పాటించాలని కోరుతోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More