ఆంధ్రప్రదేశ్‌లో 5 వేలకుపైగా ఆలయాలు నిర్మిస్తాం : మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 5500 ఆలయాలు, ప్రతి నియోజకవర్గానికి రూ.5 నుంచి 10 కోట్లతో శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపట్టనున్నట్టుగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. 2028 చివరినాటికి 5 వేల ఆలయాలు పూర్తి చేయనున్నట్టుగా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శ్రీవాణి ట్రస్ట్ నిధుల భాగస్వామ్యంతో ఏకంగా 5,500 నూతన దేవాలయాలను నిర్మించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక పరిరక్షణతో పాటు మారుమూల ప్రాంతాల్లోనూ భక్తి భావనను పెంపొందించేందుకు ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టును వేగవంతం చేస్తోందని పేర్కొన్నారు.

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహ్మదాపురం గ్రామంలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి మంత్రి ఆనం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజాక్షేమం, ధర్మ ప్రచారం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు.
రాష్ట్రంలోని మొత్తం 175 శాసనసభ నియోజకవర్గాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించనున్నట్టుగా మంత్రి ఆనం తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో నిర్మించే ఆలయానికి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు వ్యయం చేయనున్నారు. రాష్ట్రంలోని 6,700 చిన్న, పురాతన దేవాలయాల్లో నిత్య పూజలు సాగేందుకు ప్రతి నెలా రూ.10,000 చొప్పున దూప, దీప, నైవేద్యాల పథకం కింద అందిస్తున్నట్టుగా మంత్రి తెలిపారు.
దేవాలయాల నిర్మాణంతో పాటు స్థానిక మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.35 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
సోమశిల జలాశయం నుంచి ప్రత్యేక పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా ఆత్మకూరు పట్టణ ప్రజలకు శాశ్వత తాగునీటి సదుపాయం కల్పించామని గుర్తుచేశారు. పట్టణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనం, ముస్లిం సోదరుల కోసం భవనం నిర్మాణాలు వేగవంతం చేసేందుకు నిధులు మంజూరు చేశామన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే సంక్షేమం, అభివృద్ధితోపాటు ఆధ్యాత్మిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని మంత్రి ఆనం వివరించారు.
'స్థానిక అమ్మవారి ఆలయానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో పాటు 2.5 కిలోమీటర్ల నాలుగు లేన్ల బైపాస్ రోడ్డు ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఆత్మకూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, సురక్షిత తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించడమే మా లక్ష్యం. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ ఆత్మకూరును ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం.' అని మంత్రి ఆనం అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


