హైదరాబాద్ టు సోమశిల - శ్రీశైలం దర్శనం కూడా..! హెలికాప్ట‌ర్‌లో వెళ్లొచ్చు, ఇవిగో వివరాలు

ఆకాశ మార్గాన సోమశిలకు వెళ్లేందుకు తెలంగాణ టూరిజం ఏర్పాట్లు సిద్ధం చేసింది. అక్కడి కృష్ణానది అందాలనే కాదు నల్లమల ప్రకృతిని  వీక్షించవచ్చు. అటు నుంచి శ్రీశైలం కూడా వెళ్లవచ్చు. ఇందుకోసం తెలంగాణ పర్యాటక శాఖ ఈ నెల 9వ తేదీ నుంచి హెలికాప్టర్‌ సేవలను అందుబాటులోకి ప్రారంభించనుంది.

Published on: Apr 5, 2026, 08:38:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కృష్ణమ్మ పరవళ్లు.. నల్లమల ప్రకృతి అందాలను ఆకాశమార్గం నుంచి వీక్షించే అద్భుత అవకాశం పర్యాటకులకు చేరువవనుంది. ఆ దిశగా తెలంగాణ పర్యాటక శాఖ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేలా…. సోమశిల - శ్రీశైలం క్షేత్రాల మధ్య 'హేలీ టూరిజం' సేవలను ఈ నెల 9వ తేదీన ప్రారంభించనుంది.

హైదరాబాద్‌ నుంచి సోమశిల, శ్రీశైలం
హైదరాబాద్‌ నుంచి సోమశిల, శ్రీశైలం

హైదరాబాద్ నుంచి జర్నీ…

హైదరాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ హెలికాప్టర్ యాత్ర సోమశిల మీదుగా శ్రీశైలం వరకు సాగుతుంది. సోమశిల చేరుకున్న పర్యాటకులు కృష్ణానదిలో బోటింగ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఆ తర్వాత శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చు.

ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువవస్తున్నట్లు తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.

రానున్న రోజుల్లో ఈ సేవలను కేవలం సోమశిలకే పరిమితం చేయకుండా నాగార్జున సాగర్, రామప్ప, నిజాం సాగర్ వంటి ప్రముఖ పర్యాటక కేంద్రాలకు కూడా విస్తరించనున్నారు. తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.

ప్యాకేజీ వివరాలు:

  • ఈ హేలీ టూరిజంలో భాగంగా రెండు ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. మొదటి ప్యాకేజీలో హెలికాప్టర్‌ ప్రయాణం, వీఐపీ తరహాలో దైవదర్శనం ఉంటుంది. ఒక్కరికి రూ.1,10,000 చార్జీగా నిర్ణయించారు.
  • ఉదయం 5.30 గంటలకు హైదరాబాద్‌లో హెలికాప్టర్‌ బయల్దేరుతుంది. ఉదయం 7 గంటలకు సోమశిలకు చేరుకుంటుంది. సోమశిల కృష్ణానది అందాలను వీక్షిస్తారు. అక్కడ ఉన్న లలితాంబిక సోమేశ్వరం ఆలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శనం ఉంటుంది.
  • ఉదయం 8.30 గంటలకు హెలికాప్టర్‌ సోమశిల నుంచి బయలుదేరి మధ్యాహ్నం 11.30 గంటల వరకు శ్రీశైలం చేరుకుంటుంది. అక్కడ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో వీఐపీ దర్శనం ఉంటుంది.
  • మధ్యాహ్నం 11.30 గంటలకు హెలికాప్టర్‌ అక్కడి నుంచి బయలుదేరి 12:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. దీంతో ఈ ప్యాకేజీ క్లోజ్ అవుతుంది.
  • 2వ ప్యాకేజీ కింద రెండు రోజుల పాటు బస చేయవచ్చు. ఒక్కరికి రూ.1,40,000 చార్జీగా నిర్ణయించారు. విడిది గదులు, భోజన వసతితో పాటు అన్ని ఆలయాల్లో వీఐపీ తరహాలో దర్శనం ఉంటుంది.
  • సోమశిలలో ఒక రోజు బస చేయటంతో పాటు శ్రీశైలంలో మరోక్క రోజు బస చేసేందుకు వసతులు, భోజనాలు ఉంటాయి.
  • తెలంగాణ టూరిజం https://tourism.telangana.gov.in/heli-tourism వెబ్ సైట్ లో ఈ వివరాలను చెక్ చేసుకోవచ్చు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More