మెుంథా తుపాను ప్రభావంతో అక్టోబర్ 28, 29 తేదీల్లో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఏపీకి ఇప్పటికే హై అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి. తెలంగాణ అంతటా కూడా దీని ప్రభావం ఉండనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అక్టోబర్ 28 ఉదయం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరాన్ని దాటుతుందని, గంటకు 90–110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా.

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగాలను, ముఖ్యంగా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, మెుంథా తుపాను ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లోని ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఐఎండీ బులెటిన్‌ల ద్వారా ప్రజలకు సమాచారం అందించాలని, సోషల్ మీడియాలో ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
మెుంథా తుపాను మంగళవారం తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుపాను ప్రభావంతో సోమ, మంగళవారాల్లో పరిస్థితి దారుణంగా ఉండనుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. తుపాను సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు చేసింది.
తుపానుకు సంబంధించి ఎలాంటి పుకార్లు నమ్మకూడదు. భయపడొద్దు, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ కోసం ముబైల్ ఫోన్లను ఛార్జింగ్ చేస్తూ ఉండాలి. వెదర్ అప్డేట్స్ కోసం మెసేజులు గమనిస్తూ ఉండాలి. తుపాను సమయంలో అవసరమైన వస్తువులను రెడీ చేసుకోవాలి. ప్రభుత్వ అధికారులు మీ ప్రాంతంలో పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు. వారు సూచించిన వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లాలి. విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, ఇతర విలువైన డాక్యుమెంట్స్ వాటర్ ప్రూఫ్ కవర్స్‌లో భద్రపరుచుకోవాలి.
ఉరుములు, మెరుపులు, భారీ వర్షాల సమయంలో ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఎలక్ట్రికల్ పరికరాలు, గ్యాస్ కనెక్షన్లను తీసేయాలి. తలుపులు, కిటికీలు మూసేయాలి. ఒక వేళ ఇంట్లో సురక్షితం కాదనుకుంటే.. తుపాను ప్రభావం ఎక్కువ కాకముందే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లాలి. పాత భవనాలు, చెట్లు, విద్యుత్ వైర్స్, స్తంభాల కింద నిలబడకూడదు. పశువులు, పెంపుడు జంతువులకు కట్టిన తాళ్లను విప్పి, వాటిని వదిలేయాలి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదు. అత్యవసరం సాయం కోసం 112, 1070, 1800 425 0101 నంబర్లకు ఫోన్ చేయాలి.
{{/usCountry}}ఉరుములు, మెరుపులు, భారీ వర్షాల సమయంలో ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఎలక్ట్రికల్ పరికరాలు, గ్యాస్ కనెక్షన్లను తీసేయాలి. తలుపులు, కిటికీలు మూసేయాలి. ఒక వేళ ఇంట్లో సురక్షితం కాదనుకుంటే.. తుపాను ప్రభావం ఎక్కువ కాకముందే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లాలి. పాత భవనాలు, చెట్లు, విద్యుత్ వైర్స్, స్తంభాల కింద నిలబడకూడదు. పశువులు, పెంపుడు జంతువులకు కట్టిన తాళ్లను విప్పి, వాటిని వదిలేయాలి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదు. అత్యవసరం సాయం కోసం 112, 1070, 1800 425 0101 నంబర్లకు ఫోన్ చేయాలి.
{{/usCountry}}