కొద్ది రోజులుగా ఏపీని తుపాన్ భయం వెంటాడుతోంది. మొంథా తుపాను రాష్ట్రంలో బీభత్సం సృష్టించింది. అయితే మరో తుపాను సెనియార్ కూడా ఉంటుందని మెుదట అంచనా వేశారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను ఏపీ వైపు కాకుండా పశ్చిమ బెంగాల్/బంగ్లాదేశ్ వైపు మళ్లే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

దక్షిణ అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. బుధవారం నాటికి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 26 నుంచి ఎక్కువ వర్షాలు కురవనున్నాయి. తుపాను పశ్చిమ బెంగాల్/బంగ్లాదేశ్ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని పలు జిల్లాలను ఐఎండీ అప్రమత్తం చేసింది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్‌ఆర్ కడప, శ్రీ సత్యసాయి, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాలకు ఆదివారం ఎల్లో అలర్ట్ జారీ చేశామని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం, ఉపరితల ఆవర్తనం కారణంగా దక్షిణ అండమాన్ సముద్రంపై అల్పపీడన వ్యవస్థ ఏర్పడింది. ఈ వ్యవస్థ ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశలో కదులుతోంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతం వైపు కదులుతున్నప్పుడు మరింత బలపడనుంది.
దీని ఫలితంగా నవంబర్ 26 నుంచి డిసెంబర్ 1 మధ్య అనేక జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో వరి కోత పనులు జరుగుతున్నందున, రైతులు తమ ఉత్పత్తులను రక్షించుకోవడానికి చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
{{/usCountry}}దీని ఫలితంగా నవంబర్ 26 నుంచి డిసెంబర్ 1 మధ్య అనేక జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో వరి కోత పనులు జరుగుతున్నందున, రైతులు తమ ఉత్పత్తులను రక్షించుకోవడానికి చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
{{/usCountry}}తెలంగాణలో కూడా వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సోమవారం రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. అయితే రెండుమూడు రోజులుగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా పడిపోవడం లేదు. తుపాను ప్రభావం తగ్గిన తర్వాత ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు ప్రస్తుతం సాధారణ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.