Weather Update : వెదర్ అప్డేట్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరికొన్ని రోజులు వానలు
Weather Update : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది.
మార్చి నెలాఖరు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు అసాధారణంగా మారాయి. తీవ్రమైన వేడితో పాటు అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం ఈ వాతావరణ మార్పునకు కారణంగా ఉంది. దీని ఫలితంగా అధిక ఉష్ణోగ్రతలు, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వంటివి చోటుచేసుకున్నాయి. రాబోయే 24 నుండి 72 గంటల పాటు పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, దక్షిణ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ద్రోణి ప్రభావంతో వాతావరణం అకస్మాత్తుగా మారింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాలలో గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా నంద్యాల, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మరింత తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల వరకు చేరుతున్నప్పటికీ.. సాయంత్రం వేళల్లో పిడుగుపాటు ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఉరుములతో కూడిన వర్షం సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదని వెల్లడించారు. ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని పరిమితం చేసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు.. సూచించారు.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు అధికంగానే ఉన్నప్పటికీ.. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ , రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, మెదక్ వంటి జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వానలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 37 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. సాయంత్రం పూట బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే పగటిపూట వేడి గాలులు కొనసాగే అవకాశం ఉన్నందున ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


