...
...
Next Story

పెళ్లి ఊరేగింపులో వధువు డ్యాన్స్‌ చేయడాన్ని నచ్చని వరుడు.. ఊహించని షాక్ ఇచ్చిన తండ్రి!

పెళ్లి ఊరేగింపు(బారాత్) సమయంలో వధువు డ్యాన్స్‌ చేయడాన్ని వరుడు అభ్యంతరం తెలిపాడు. దీంతో వధువు కుటుంబం.. వరుడిపై సీరియస్ అయింది. ఈ సంఘటన మార్కాపురం జిల్లాలో జరిగింది.

Published on: Jul 6, 2026, 15:10:30 IST
Advertisement

పెళ్లంటే నూరేళ్ల పంట.. ఇరు కుటుంబాల మధ్య బంధాన్ని ముడివేసే వేడుక. అలాంటి పెళ్లి వేడుకలో డీజే పాటలు, బంధుమిత్రుల డ్యాన్సులు ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయాయి. కానీ అదే డ్యాన్స్ ఒక పెళ్లి బంధాన్ని ముక్కలు చేసింది. వధువు ఉత్సాహంగా డ్యాన్స్ చేయాలనుకోవడాన్ని వరుడు తప్పుబట్టడం, అది కాస్తా వివాదంగా మారి చివరకు పెళ్లే రద్దయ్యేలా చేసింది. ఈ సంఘటన మార్కాపురం జిల్లాలో వెలుగుచూసింది.

అసలేం జరిగిందంటే?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మార్కాపురం జిల్లా రాచర్ల మండలం చినగానిపల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడికి, తురిమెళ్ల గ్రామానికి చెందిన ఒక యువతికి పెద్దలు వివాహం నిశ్చయించారు. ఆదివారం ఉదయం వివాహ వేడుక జరగాల్సి ఉంది. పెళ్లికి ముందు వధువరులను ఊరేగింపు ప్లాన్ చేశారు. శనివారం రాత్రిపూట వధువుతోపాటుగా ఆమె కుటుంబ సభ్యులు చిన్నగానిపల్లికి వెళ్లారు. వధూవరులను వాహనం ఎక్కించి.. బంధువులు ఊరేగింపు నిర్వహించారు. రెండు కుటుంబాల బంధువులు, స్నేహితులు డ్యాన్స్ చేస్తూ వధూవరులను కూడా పిలిచారు. కానీ డ్యాన్స్ చేయడానికి వరుడి సిద్ధంగా లేడు. వధువు మాత్రం ఆసక్తి చూపించింది. దీంతో వరుడు ఆమెను మందలించాడు.

అయినప్పటికీ పెళ్లి వేడుకలో ఉన్న కొందరు అతిథులు, బంధువులు వధువును తమతో కలిసి స్టెప్పులు వేయాలని కోరారు. జీవితంలో ఒకేసారి వచ్చే క్షణాలని, అందరితో కలిసి ఆనందాన్ని పంచుకోవడానికి వధువు కూడా డ్యాన్స్ చేయడానికి సిద్ధపడింది.

అయితే వధువు అందరి ముందు డ్యాన్స్ చేయడం వరుడికి అస్సలు నచ్చలేదు. ఆమెను డ్యాన్స్ చేయవద్దంటూ వరుడు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. వధువు ఉత్సాహాన్ని వరుడు అలా అందరి ముందూ అణచివేయడం, కోప్పడటం చూసి వధువు కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. పెళ్లి కాకముందే ఇంతలా ఆంక్షలు విధిస్తూ, అందరి ముందు అవమానించేలా మాట్లాడటం ఇరు కుటుంబాల మధ్య తీవ్రమైన వాగ్వాదానికి దారితీసింది. బారాత్ కాస్తా ఇరు వర్గాల మధ్య గొడవతో అట్టుడికిపోయింది.

ట్విస్ట్ ఇచ్చిన వధువు తండ్రి

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe