Samantha Pregnancy: సమంత ప్రెగ్నెంట్ అని తెలిసి షాకయ్యాను.. అలాగే ఓ డ్యాన్స్, కార్ ఛేజింగ్ సీన్ చేసింది: నందినీ రెడ్డి

Samantha Pregnancy: మా ఇంటి బంగారం మూవీ షూటింగ్ టైమ్ లోనే సమంత ప్రెగ్నెంట్ అని తెలిసి తాను షాకయ్యానని డైరెక్టర్ నందినీ రెడ్డి వెల్లడించింది. అయితే ఆ పరిస్థితుల్లోనూ ఆమె ఓ పాటతోపాటు కార్ ఛేజింగ్ సీన్స్ షూటింగ్ చేసినట్లు తెలిపింది.

Published on: Jun 30, 2026, 16:39:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Samantha Pregnancy: సమంత రూత్ ప్రభు లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ యాక్షన్ కామెడీ డ్రామా 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ దగ్గర రూ.80 కోట్ల మార్కును దాటేసి భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ మీట్‌లో తను ప్రెగ్నెంట్ అనే గుడ్ న్యూస్ చెప్పి సామ్ అందరికీ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.

Samantha Pregnancy: సమంత ప్రెగ్నెంట్ అని తెలిసి షాకయ్యాను.. అలాగే ఓ డ్యాన్స్, కార్ ఛేజింగ్ సీన్ చేసింది: నందినీ రెడ్డి
Samantha Pregnancy: సమంత ప్రెగ్నెంట్ అని తెలిసి షాకయ్యాను.. అలాగే ఓ డ్యాన్స్, కార్ ఛేజింగ్ సీన్ చేసింది: నందినీ రెడ్డి

అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైమ్‌లోనే సమంత కడుపుతో ఉందనే నిజం తనకు తెలిసి షాకయ్యానని డైరెక్టర్ నందిని రెడ్డి ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయింది.

'తస్సాదియ్యా' సాంగ్ షూట్‌లో ఊహించని ట్విస్ట్

"మేము సినిమాలో ఎంతో ఎనర్జిటిక్‌గా ఉండే 'తస్సాదియ్యా' సాంగ్ షూట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఆర్టిస్టులు అందరూ సెట్స్‌లో రెడీగా ఉన్నారు. జనరల్‌గా సమంత ఎప్పుడూ టైమ్‌కే వస్తుంది. కానీ ఆ రోజు ఉదయం సామ్ హెల్త్ అస్సలు బాలేదని, ఉదయాన్నే అనారోగ్యంతో బాధపడుతోందని టీమ్ మెంబర్స్ చెప్పారు. జ్వరం ఏమైనా వచ్చిందేమో అనుకున్నాను. నాలుగు రోజుల్లో ప్లాన్ చేసిన ఈ సాంగ్‌ను కేవలం రెండు రోజుల్లోనే కంప్లీట్ చేయగలమా అని వాళ్లు నన్ను అడిగారు. సామ్ ఎలాగోలా కష్టపడి ఆ రోజు షూటింగ్‌లో పాల్గొంది" అని నందిని రెడ్డి ఆనాటి విషయాలను గుర్తుచేసుకుంది.

ప్రెగ్నెంట్ అని చెప్పగానే షాక్‌తో ఫ్రీజ్ అయిపోయా

మరుసటి రోజు ఉదయం సమంత సెట్స్‌కి రాగానే హెల్త్ ఎలా ఉందో కనుక్కుందామని నందిని రెడ్డి వెళ్ళింది. అప్పుడు సామ్ ఎవరికీ వినపడకుండా నెమ్మదిగా తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని డైరెక్టర్‌కు చెప్పేసింది. ఆ మాట వినగానే ఒక్క నిమిషం పాటు మైండ్ బ్లాంక్ అయిపోయి, చేష్టలు ఉడిగిపోయానని నందిని రెడ్డి తెలిపింది.

ఈ హ్యాపీ న్యూస్ అప్పుడే సెట్స్‌లో ఎవరికీ చెప్పవద్దని సమంత రిక్వెస్ట్ చేసిందట. దాంతో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ దగ్గరకు వెళ్లి, సామ్‌తో ఎక్కువ రిహార్సల్స్ చేయించవద్దని, డైరెక్ట్ టేక్‌లోనే ఎనర్జీ చూపించేలా ప్లాన్ చేయమని సీక్రెట్‌గా రిక్వెస్ట్ చేసినట్లు నందిని చెప్పింది.

ప్రెగ్నెన్సీ టైమ్‌లో కార్ చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్

కేవలం సాంగ్ మాత్రమే కాదు, ఆ తర్వాత సినిమాలో వచ్చే ఒక ఇంటెన్స్ కార్ చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా సమంత ప్రెగ్నెన్సీతోనే పూర్తి చేసింది. సామ్‌కు ఎలాంటి ఒత్తిడి కలగకూడదని నందిని రెడ్డి షూటింగ్ షెడ్యూల్‌ను మధ్యాహ్నం 3:30 తర్వాత ప్లాన్ చేసింది.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే హెల్త్ పాడవుతుందని ఈ జాగ్రత్తలు తీసుకుంది. సమంత డెడికేషన్‌కు థ్యాంక్స్ చెబుతూ, ప్రస్తుతం సామ్ తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి డిసెంబర్‌లో పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తోందని నందిని రెడ్డి ఎమోషనల్ అయింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More