...
...
Next Story

పడిపోతున్న ఆరెంజ్ ధరలు.. నో ఎక్స్‌పోర్ట్స్.. లోకల్ మార్కెట్లకే పండ్లు!

Orange Prices : పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. ఏపీలో నారింజ ధరలు పడిపోతున్నాయి.

Published on: Mar 23, 2026, 15:51:42 IST
Advertisement

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతులకు అంతరాయం కలగడంతో అనంతపురం నారింజ మార్కెట్‌లో ధరలు తీవ్రంగా పడిపోయాయి. రైతులు కనీస మద్దతు ధర పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎగుమతులు దెబ్బతినడంతో వ్యాపారులు పూర్తిగా స్థానిక మార్కెట్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. అంతేకాకుండా రాయలసీమ ప్రాంతానికి చెందిన నారింజ రైతు ఉత్తరాది మార్కెట్లలో మహారాష్ట్ర పండ్లతో పోటీ పడవలసి వస్తోంది.

నారింజ ధరలు
నారింజ ధరలు

రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు ప్రాంతాలలో నారింజ ఉత్పత్తి బాగా జరుగుతుంది. సుమారు 22 లక్షల టన్నుల నారింజ ఉత్పత్తిలో సుమారు 90 శాతానికిపైగా రాయలసీమ ప్రాంతంలోనే జరుగుతున్నాయి. అనంతపురంలో 48,000 హెక్టార్లు, కడప జిల్లాలో 37,000 హెక్టార్లలో నారింజ తోటలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాలు కలిసి మొత్తం పంట విస్తీర్ణంలో అధిక భాగం ఉన్నాయి.

అనంతపురం మార్కెట్ యార్డులో మంచి క్వాలిటీ ఉండే నారింజ పండ్లు టన్నుకు సుమారు రూ. 22,000కు అమ్ముడవుతున్నాయి. గతంలో టన్నుకు కనీసం రూ.30 వేల నుంచి రూ.35 వేల మధ్య ఉండేది. ప్రస్తుత ధరలు చాలా తక్కువగా ఉన్నాయని, రైతులు తమ ఖర్చులను కూడా రాబట్టుకోలేకపోతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎగుమతులు ఆలస్యం కావడం లేదంటే.. బుక్ అయినవి కూడా కూడా క్యాన్సిల్ అవుతుండటంతో స్థానిక మార్కెట్లకే పండ్లు చేరుతున్నాయి.

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో కొన్ని రోజులుగా.. అనంతపురం మార్కెట్‌కు పండ్లు ఎక్కువగా వస్తున్నాయి. ఎగుమతుల ఆర్డర్లు దాదాపుగా నిలిచిపోయాయి. ఇప్పుడు సరకులను దేశీయ మార్కెట్లకు మళ్లిస్తున్నారు, దీనివల్ల అధిక సరఫరా ఏర్పడి ధరలు తీవ్రంగా పడిపోతున్నాయి. చాలా మంది రైతులు తమ పంటను అత్యంత తక్కువ ధరలకు అమ్ముకోవలసి వస్తోంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని కనీస మద్దతు ధరను ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. లేదంటే రైతుల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe