అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన దంపతులు మృతి
అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దంపతులు మృతి చెందారు. వారి పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
అమెరికాలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి చెందారు. వాషింగ్టన్‌లో జరిగిన కారు ప్రమాదంలో కొటికలపూడి కృష్ణ కిశోర్ (45), ఆశ (40) ప్రాణాలు కోల్పోయారు. వారి కుమారుడు, కుమార్తె తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

కృష్ణ కిశోర్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చాలా ఏళ్లుగా పని చేస్తున్నారు. 10 రోజుల క్రితమే కృష్ణ కిశోర్, ఆశ పాలకొల్లు వచ్చి వెళ్లారు. ఇటీవలే దుబాయ్‌లో న్యూఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో కిశోర్, ఆశ దంపతులు మృతి చెందారు. దీంతో పాలకొల్లులో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇటీవలే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు మరణించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనూరుకు చెందిన కడియాల కోటేశ్వరరావు కూతురు భావన మృతిచెందారు.
మేఘన, భావన మూడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. ఎమ్మెస్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉద్యోగం కోసం వెతుకుతున్నారు. తాజాగా మెుత్తం 8 మంది స్నేహితులు రెండు కార్లలో కాలిఫోర్నియాలో టూర్ వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో కారు అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద లోయలో పడిపోయింది. ఈ ఘటనలో మేఘన, భావన మృతి చెందారు.
మేరీల్యాండ్‌లో తెలుగు యువతి హత్య
మరోవైపు మేరీల్యాండ్‌లోని కొలంబియాలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నికితా గొడిషాల అనే తెలుగు యువతి హత్యకు గురైంది. దీనిపై అమెరికా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ ఈ హత్య కేసులో నిందితుడని పోలీసులు అనుమానిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల తర్వాత నికితా కనిపించడం లేదు. ఈ మేరకు ఫిర్యాదు అందింది.
దర్యాప్తు సంస్థల ప్రకారం, డిసెంబర్ 31న ఎల్లికాట్ సిటీలోని ఆమె అపార్ట్‌మెంట్‌లో తాను చివరిసారిగా నికితాను చూశానని శర్మ పోలీసులకు చెప్పాడు. జనవరి 2న భారతదేశానికి వచ్చాడు. అమెరికా పోలీసులు అపార్ట్‌మెంట్‌లో సోదాలు నిర్వహించగా నికితా మృతదేహం దొరికింది. ఆమె శరీరంపై గాయాల గుర్తులు కనిపించాయని, ఇది హత్య కేసుగా నిర్ధారించామని అధికారులు తెలిపారు. ఈ సంఘటన తర్వాత భారతదేశానికి వచ్చిన శర్మపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నికితా మూలాలు సికింద్రాబాద్లో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


