వెనెజువెలాపై అమెరికా దాడి- ఈ రోజు స్టాక్ మార్కెట్ పరిస్థితేంటి? చమురు ధర పెరిగిందా?
జనవరి 5, ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 573 పాయింట్లు పెరిగి 85,762 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 182 పాయింట్లు వృద్ధిచెంది 26,329 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 439 పాయింట్లు పెరిగి 60,151 వద్దకు చేరింది.

శనివారం తెల్లవారుజామున వెనెజువెలాపై అమెరికా మెరుపు దాడి చేసి, ఆ దేశాధ్యక్షుడు నికొలస్ మదురోను అరెస్ట్ చేసింది. దీని ప్రభావం ప్రపంచ స్టాక్ మార్కెట్లపై ప్రతికూలంగా ఉంటుందని అందరు భావించారు. కానీ ఆసియా స్టాక్ మార్కెట్లు, గిఫ్ట్ నిఫ్టీపై వెనెజువెలా అనిశ్చితి ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిజర్వ్ ఉన్న వెనెజువెలాలో సంక్షోభం కారణంగా.. ముడిచమురు ధర మాత్రం స్వల్పంగా పెరిగింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 544.36 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 534.24 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 తన కీలక రెసిస్టెన్స్ 26,200 ని దాటింది. ప్రస్తుతం సూచీకి 226,450- 26,500 లెవల్స్ వద్ద రెసిస్టెన్స్ ఉంది. 26,150- 26,200 వద్ద సపోర్ట్ ఉంది,” అని ఛాయిస్ బ్రోకింగ్‌కి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సుమిత్ బగాడియా తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.66 శాతం వృద్ధిచెందింది. ఎస్ అండ్ పీ 500 0.19శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.03 శాతం డౌన్ అయ్యింది
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
చమురు ధరలు..
వెనెజువెలాపై అమెరికా దాడులు నేపథ్యంలో ముడిచమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్ రూడ్ 17 సెంట్లు పెరిగి బ్యారెల్‌కి 60.92 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
జేబీఎం ఆటో- బై రూ. 666.6, స్టాప్ లాస్ రూ. 634, టార్గెట్ రూ. 720
అనంత్ రాజ్- బై రూ. 584.05, స్టాప్ లాస్ రూ. 554, టార్గెట్ రూ. 640
సీఈఎస్సీ- బై రూ. 175.3, స్టాప్ లాస్ రూ. 167, టార్గెట్ రూ. 192
ఎలెకాన్ ఇంజినీరింగ్ కంపెనీ- బై రూ. 501, స్టాప్ లాస్ రూ. 478, టార్గెట్ రూ. 550
యూనో మిండా- బై రూ. 1321.2, స్టాప్ లాస్ రూ. 1260, టార్గెట్ రూ. 1450
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


