రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేద్దాం? : అతి త్వరలో ప్రభుత్వం ఫైనల్ డెసిషన్!

విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు కేబినెట్ సబ్‌కమిటీ చర్చలు చేస్తోంది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ప్లాన్ చేయనున్నారు.

Published on: Dec 25, 2025, 12:48:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్‌పై కూటమి ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది. ఏ నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్రానికి స్థిరమైన ఆదాయాన్ని ఆర్జిస్తూనే, ప్రజా ప్రయోజనాన్ని నిర్ధారించడంపై దృష్టి పెడుతుందని అని మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ అన్నారు. రుషికొండ ప్యాలెస్ వినియోగానికి ఆచరణీయమైన ఎంపికలను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ మూడోసారి సమావేశం అయింది.

రుషికొండ ప్యాలెస్
రుషికొండ ప్యాలెస్

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(పర్యాటక) అజయ్ జైన్, ఏపీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి సహా సీనియర్ అధికారులు రుషికొండ ప్యాలెస్‌కు సంబంధించి ప్రతిపాదనల స్థితిని కమిటీకి వివరించారు. తాజ్, లీలా ప్యాలెస్, అట్మాస్ కోర్, ఫెమా వంటి ప్రముఖ ఆతిథ్య బ్రాండ్ల నుండి ప్రతిపాదనలు వచ్చాయని మంత్రులు కేశవ్, దుర్గేష్ వెల్లడించారు. అయితే ప్రస్తుత నిర్మాణాలు హోటల్ కార్యకలాపాలకు పూర్తిగా అనుకూలంగా లేవని వాదనలు ఉన్నాయి. అదనపు నిర్మాణాలు చేయాల్సి రావొచ్చనే అభిప్రాయం వచ్చింది. అప్పుడే ఆతిథ్య రంగానికి అనుకూలంగా ఉండనున్నాయని చెబుతున్నారు.

రుషికొండ స్థలం దాదాపు తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉందని, కోస్టల్ రెగ్యులేషన్ జోన్(CRZ) నిబంధనల ప్రకారం ఏడు ఎకరాల్లో నిర్మాణం నిషేధం ఉందని మంత్రులు పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించకుండా రెండు ఎకరాలను ఎలా ఉత్తమంగా ఉపయోగించుకోవచ్చనే దానిపై సచివాలయంలో జరిగిన సమావేశంలో చర్చించారు.

ఇంకా, రుషికొండ సైట్‌లోని చివరి రెండు బ్లాక్‌లను ఆర్ట్ గ్యాలరీతో సహా ప్రజల ఉపయోగం కోసం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి అలాగే ఉంచాలని నిర్ణయించారు. తుది ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోవడానికి డిసెంబర్ 28న ఆన్‌లైన్‌లో మరో సమీక్ష సమావేశం జరుగుతుందని మంత్రులు తెలిపారు. వీటిని ఆమోదం కోసం రాష్ట్ర మంత్రివర్గం ముందు ఉంచుతామని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు కేశవ్, దుర్గేష్ విమర్శించారు. ఈ నిర్ణయాలు పర్యాటక శాఖకు గణనీయమైన నష్టాన్ని కలిగించాయని ఆరోపించారు. నెలవారీ నిర్వహణ ఖర్చు దాదాపు రూ.25 లక్షలతో కూడిన ప్యాలెస్ నిర్మించారన్నారు. అందుబాటులో ఉన్న భూమి, నిర్మాణాలను ఉపయోగించడం, ఆదాయాన్ని తీసుకురావడం, ఆస్తిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం, అర్థవంతంగా మార్చడం ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. మరికొన్ని రోజుల్లో వీటిని ఏం చేద్దాం అనేదానిపై క్లారిటీ రానుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More