హిడ్మాతో సహా సీనియర్ మావోయిస్టులు ఏపీ ఎన్‌కౌంటర్లలో మరణించిన తర్వాత సీపీఐ (మావోయిస్ట్) చీఫ్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ ఎక్కడ ఉన్నారనే దానిపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. పోలీసులు అతడిని అరెస్ట్ చేయలేదని చెబుతున్నారు. అయితే తిప్పిరి తిరుపతి కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు మాత్రం కస్టడీలో ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్లలో పీఎల్‌జీఏ మొదటి బెటాలియన్ కమాండర్ హిడ్మా, అనేక మంది సీనియర్ మావోయిస్టులు చనిపోయారు. సుదీర్ఘ సౌయుధ పోరాటం హిడ్మా మరణంతో చివరి దశకు చేరుకుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అంతలా ప్రభావితం చేసే వ్యక్తిని కోల్పోయిన తర్వాత మావోయిస్టు పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.
హిడ్మా మరణం తర్వాత మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సీపీఐ(మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ భద్రత, ఆచూకీపై చాలా మంది ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగిన మరుసటి రోజు అంటే బుధవారం నాడు మారేడుమిల్లి అడవుల్లోని జీఎం వలస గ్రామంలో మరో ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. అందులో దేవ్‌జీ వారిలో ఉన్నారని పుకార్లు వచ్చాయి. ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు కార్యకర్తలలో దేవ్‌జీ లేరని ఆంధ్రప్రదేశ్ ఏడీజీ(ఇంటెలిజెన్స్) మహేష్ కుమార్ లడ్డా స్పష్టం చేశారు.
దేవ్ జీని అరెస్టు చేయలేదని, ఆయన తెలంగాణలో లేదా ఛత్తీస్‌గఢ్ లో ఉండవచ్చని అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. దేవ్ జీ ఎక్కడ ఉన్నారనేది ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ లలో చర్చనీయాంశంగా మారింది. మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్ నుంచి దాదాపు 15 మంది మావోయిస్టులు తప్పించుకున్నారని, వారి కోసం పోలీసు బృందాలు వెతుకుతున్నాయని మీడియా సమావేశంలో ఇంటెలిజెన్స్ ఏడీజీ లడ్డా పేర్కొన్నారు. దీంతో తప్పించుకున్న వారిలో దేవ్‌జీ కూడా ఉండవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.
మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వానికి మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. కానీ పరిస్థితులు మారుతున్న తరుణంలో సెక్యూరిటీ అంత పెద్ద మెుత్తంలో లేదు. కానీ మావోయిస్టు చీఫ్ వెంట ఎల్లప్పుడూ భద్రతా బృందం ఉంటుంది. అగ్రనాయకత్వాన్ని కచ్చితంగా కాపాడుకునేందుకే మావోయిస్టులు మెుదటి ప్రాధాన్యత ఇస్తారు. అయితే తాజాగా మావోయిస్ట్ ఛీఫ్ దేవ్‌జీ సెక్యూరిటీ టీమ్‌లో 9 మందిని ఏపీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో దేవ్‌జీ ఎక్కడ? అనే ప్రశ్న ఎక్కువైంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా.. మావోయిస్ట్ చీఫ్‌ను సెక్యూరిటీ అస్సలు వదిలిపెట్టదని చెబుతున్నారు.
{{/usCountry}}మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వానికి మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. కానీ పరిస్థితులు మారుతున్న తరుణంలో సెక్యూరిటీ అంత పెద్ద మెుత్తంలో లేదు. కానీ మావోయిస్టు చీఫ్ వెంట ఎల్లప్పుడూ భద్రతా బృందం ఉంటుంది. అగ్రనాయకత్వాన్ని కచ్చితంగా కాపాడుకునేందుకే మావోయిస్టులు మెుదటి ప్రాధాన్యత ఇస్తారు. అయితే తాజాగా మావోయిస్ట్ ఛీఫ్ దేవ్‌జీ సెక్యూరిటీ టీమ్‌లో 9 మందిని ఏపీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో దేవ్‌జీ ఎక్కడ? అనే ప్రశ్న ఎక్కువైంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా.. మావోయిస్ట్ చీఫ్‌ను సెక్యూరిటీ అస్సలు వదిలిపెట్టదని చెబుతున్నారు.
{{/usCountry}}ఆయన ఇంకో దగ్గర ఉంటే, సెక్యూరిటీ షెల్టర్‌లో ఏం చేస్తారని ప్రశ్నలు వస్తున్నాయి. షెల్టర్‌లో ఉన్న అగ్రనాయకులను కూడా అడవుల్లోకి పట్టుకెళ్తున్నారని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేవ్‌జీ పోలీసుల అదుపులో ఉన్నారని, అతడిని అరెస్టును ప్రకటించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. అగ్రనాయకత్వాన్ని తుడిచేస్తే మళ్లీ విప్లవం గురించి ఆలోచించేందుకు సానుభూతిపరులు కూడా భయపడుతారని, అందుకే పోలీసులు ప్లాన్ చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నాయి. హిడ్మాను కూడా షెల్టర్ నుంచి మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకొచ్చి చంపేశారని కొందరు అంటున్నారు.
దేవ్‌జీ సురక్షితంగా ఉన్నారనే విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు, మావోయిస్టు సానుభూతిపరులు దాదాపు నమ్మడం లేదు. పోలీసులు చెప్పే విషయాలను ఖండిస్తున్నారు. మావోయిస్ట్ చీఫ్ పోలీసు కస్టడీలో ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు దేవ్‌జీ సోదరుడు తిప్పిరి గంగాధర్ జగిత్యాల జిల్లాలోని తమ స్వస్థలమైన కోరుట్లలో మీడియాతో మాట్లాడారు. ఏపీ పోలీసులు తిరుపతిని అరెస్టు చేసి ఉంటే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు.
కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలతో లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నా.. అగ్రనాయకత్వాన్ని బూటకపు ఎన్‌కౌంటర్ చేస్తున్నారని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. హిడ్మా కూడా సాయుధ పోరాట విరమణ గురించి ఆలోచిస్తు్న్నట్టుగా ఛత్తీస్‌గఢ్ జర్నలిస్టుకు రాసిన లేఖ గురించి చర్చ జరుగుతోంది. అయితే అంతకుముందు కొన్ని విషయాలపై చర్చించాలని హిడ్మా అన్నారని చెబుతున్నారు. లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నా.. కావాలనే టాప్ లీడర్లను చంపేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.