టీవీ సౌండ్ తగ్గించమనడమే తప్పైంది.. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

గుంటూరు జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. టీవీ సౌండ్ విషయంలో జరిగిన గొడవ ఒకరి ప్రాణాలను తీసుకుంది.

Published on: Feb 20, 2026, 12:12:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇటీవలి కాలంలో ఎవరు.. ఎందుకు.. ఎలా చంపుతున్నారో అర్థంకాని పరిస్థితి. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలను తీసేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోనూ అలాంటి ఘరోమైన ఘటనే జరిగింది. కేవలం టీవీ సౌండ్ విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగింది. ఈ ఘటనలో భర్త ప్రాణాలు పోయాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంగళగిరిలో షేక్ అహ్మద్ అనే 27 ఏళ్ల వ్యక్తి ఏసీ మెకానిక్‌గా పనిచేస్తు్న్నాడు. కొన్ని నెలల కిందట క్రాంతి అనే యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

గురువారం రాత్రి క్రాంతి ఇంట్లో టీవీ సౌండ్ పెంచింది. మరీ అంత సౌండ్ అవసరమా.. తగ్గించు అంటూ అహ్మద్ చెప్పాడు. నన్ను టీవీ సౌండ్ తగ్గించమంటావా అంటూ క్రాంతి గట్టిగా అరిచింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో భార్యపై అహ్మద్ చేయిచేసుకున్నాడు. కాసేపు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పక్కనే ఉన్న ఉల్లిపాయలు కోసే కత్తితో భర్త అహ్మద్‌ను క్రాంతి పొడించింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించి అహ్మద్ చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విడాకులు ఇవ్వలేదని భార్యను చంపిన భర్త

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. దుర్గయ్య అనే వ్యక్తి 12 సంవత్సరాల కిందట సొంత అక్క కూతురు జ్యోతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దుర్గయ్య వ్యవసాయం చేస్తున్నాడు. పెద్దాపురంలోని ఒక రొయ్యల కంపెనీలో జ్యోతి పని చేస్తుంది. కొన్ని రోజులుగా భార్య జ్యోతిపై దుర్గయ్య అనుమానం పెచుకున్నాడు. ఇక అప్పటి నుంచి తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

మూడు నెల కిందట గొడవలు ఎక్కువ అయ్యాయి. గొడవలతో అలసిపోయిన జ్యోతి.. పుట్టింటికి వెళ్లిపోయింది. తనతో కలిసి ఉండాలని లేదంటే వెంటనే విడాకులు ఇవ్వాలని జ్యోతిని దుర్గయ్య బలవంతం చేస్తున్నాడు. చేసేదేమీ లేక పుట్టింటిలోనే ఉంటుంది జ్యోతి. భార్యపై దుర్గయ్య ద్వేషం పెంచుకున్నాడు. ఆమెను చంపేయాలని ప్లాన్ వేశాడు.

ఇటీవల పని ముగించుకుని గ్రామానికి వచ్చిన జ్యోతిపై దుర్గయ్య దాడి చేశాడు. ఎక్కవగా రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తనను అరెస్ట్ చేస్తారనే భయంతో దుర్గయ్య పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉంది. బిక్కవోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More