16 ఏళ్ల అమ్మాయితో ఇంటిమేట్ సీన్‌.. ఈ శృంగార స‌న్నివేశాలు ఇల్లీగ‌ల్‌.. టీవీ సీరియల్ పై నెటిజ‌న్ల ఫైర్‌

ఓ టీవీ సీరియల్ షోపై నెటిజన్లు మండిపడుతున్నారు. 16 ఏళ్ల అమ్మాయితో ఇంటిమేట్ సీన్ ఎలా చేయిస్తారని? ఈ శృంగార స‌న్నివేశాలు ఇల్లీగ‌ల్‌ అంటూ ఫైర్ అవుతున్నారు. దీంతో 'రిమ్‌జిమ్ - చోటి ఉమర్ బడా సఫర్' అనే టీవీ షోపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

Published on: Jan 29, 2026, 12:37:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓ హిందీ టెలివిజన్ సీరియల్ తీవ్ర విమర్శల పాలవుతోంది. ఇది ఇల్లీగల్ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అందుకు కారణం 16 ఏళ్ల అమ్మాయితో ఇంటిమేట్ సీన్లు ఉండటమే. మైనర్ అమ్మాయి శృంగార స‌న్నివేశాల కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్న ఆ టీవీ షో ‘రిమ్‌జిమ్ - చోటి ఉమర్ బడా సఫర్'. ఇది దంగల్ టీవీలో ప్రసారమవుతోంది.

టీవీ షో నుంచి స్టిల్
టీవీ షో నుంచి స్టిల్

16 ఏళ్ల అమ్మాయితో

దంగల్ టీవీలో టెలికాస్ట్ అవుతున్న ‘రిమ్‌జిమ్ - చోటి ఉమర్ బడా సఫర్' షోలో 16 ఏళ్ల యషికా శర్మ, 24 ఏళ్ల హిమాన్షు అవస్థి నటిస్తున్నారు. ఇది ఒక టీనేజర్, అడల్డ్ మధ్య సంబంధం చుట్టూ సాగే కథతో నడుస్తున్న సీరియల్. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమైంది. మైనర్ అమ్మాయి ఇంటిమేట్ సీన్లు టెలికాస్ట్ చేయడం ఇల్లీగల్ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ ఎపిసోడ్ లో

దంగల్ టీవీలో బుధవారం (జనవరి 28) ప్రసారమైన ఎపిసోడ్‌లో ఈ ఇంటిమేట్ సీన్ ఉంది. ఈ సన్నివేశంలో రిమ్‌జిమ్ (యషికా) బ్లౌజ్ ఊడిపోయిందని సమీర్ (హిమాన్షు) గమనిస్తాడు. తన షర్ట్ విప్పి ఆమెకు తొడుగుతాడు. ఆమెను దగ్గరకు లాక్కొని బ్లౌజ్ సరిచేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు టైట్ హగ్ చేసుకుంటారు.

అంతకుముందు ఎపిసోడ్‌లో కూడా ఈ యషికా, హిమాన్షు మంచంపై కలిసి ఉన్న సన్నివేశాలు ఉన్నాయి. నగ్నంగా ఉన్న యషికా వీపుపై కెమెరా ఫోకస్ పెట్టడం కూడా ఆన్‌లైన్‌లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.

వైరల్ గా

బుధవారం రాత్రి సోషల్ మీడియా లో ఈ ‘రిమ్‌జిమ్ - చోటి ఉమర్ బడా సఫర్' ఎపిసోడ్‌ల క్లిప్పింగ్‌లు, స్క్రీన్‌ షాట్లు వైరల్ గా మారాయి. ‘‘16 ఏళ్ల అమ్మాయి ఇలాంటి ఇంటిమేట్ సీన్లలో నటించడాన్ని ఏ ప్రపంచంలో ఒప్పకుంటారు’’ అని ఓ యూజర్ పోస్టు చేశాడు. 'ఇది ఇల్లీగల్’ అని మరొకరు కామెంట్ చేశారు. మైనర్లతో ఇలాంటి సీన్లు తీయడం ఆపాలని, ఈ టీవీ షోపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

మైనర్ లను ఇలా

ఇలాంటి శృంగార స‌న్నివేశాలే టీవీ షోలో ఉండాలనుకుంటే అందుకు తగ్గ వయసున్న అడల్ట్ నటులను ఎందుకు తీసుకోలేదని మేకర్స్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 'ఈ సీరియల్స్‌లో నటించడానికి దేశంలో మేజర్లైన అమ్మాయిలే లేరా? రొమాంటిక్ రోల్స్ కోసం మైనర్ అమ్మాయిలను ఎందుకు తీసుకుంటున్నారు? ఇది చాలా అసహ్యంగా ఉంది’ అని ఒక సోషల్ మీడియా యూజర్ మండిపడ్డాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More