ఏడాది మొత్తం నంబర్ వన్ సీరియల్ ఇదే.. చివరి వారం రేటింగ్స్‌లోనూ దుమ్ము రేపింది.. 52వ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
తెలుగు టీవీ సీరియల్స్ గతేడాది చివరి వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఏడాది మొత్తం స్టార్ మాలోని కార్తీక దీపం 2 సీరియల్ టాప్ లో నిలుస్తూ వచ్చింది. టాప్ 10 సీరియల్స్ లో ఎప్పటిలాగే స్టార్ మా హవా చివరి వారం కూడా కొనసాగింది.
తెలుగు టీవీ సీరియల్స్ 52వ వారం టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. వీటిలో ఎప్పటిలాగే కార్తీక దీపం 2 సీరియల్ హవా కొనసాగింది. మొత్తంగా టాప్ 10లో ఏడు స్టార్ మా, మూడు జీ తెలుగు సీరియల్స్ చోటు సంపాదించాయి. స్టార్ మాలో వచ్చిన కొత్త సీరియల్ పొదరిల్లు.. వరుసగా మూడో వారం కూడా టాప్ 10లోనే నిలవడం విశేషం.

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
2025 మొత్తం తెలుగులో స్టార్ మా సీరియల్స్ హవానే కొనసాగిన విషయం తెలుసు కదా. చివరి వారం కూడా అదే జరిగింది. టాప్ 10లో ఏడు ఈ ఛానెల్ కు చెందిన సీరియల్సే ఉన్నాయి. వీటిలోనూ కార్తీక దీపం 2 సీరియల్ 14.94 రేటింగ్ తో తొలి స్థానంతో ఏడాదిని ముగించింది. 2025లో మధ్యలో కొన్ని వారాలు తప్ప ఏడాది మొత్తంగా ఈ సీరియలే టాప్ లో ఉంటూ వచ్చింది. కొన్నాళ్లు ఇల్లు ఇల్లాలు పిల్లలు టాప్ లోకి దూసుకెళ్లినా.. మళ్లీ కార్తీక దీపం 2 తన స్థానాన్ని అందుకుంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు రెండో స్థానానికే పరిమితమైంది. తాజాగా ఆ సీరియల్ కు 14.20 రేటింగ్ వచ్చింది. మూడో స్థానంలో గుండె నిండా గుడి గంటలు ఉంది. దీనికి 12.11 రేటింగ్ రాగా.. నాలుగో స్థానంలో ఉన్న ఇంటింటి రామాయణం 11.91 రేటింగ్ తో నిలిచింది.
చిన్ని ఐదో స్థానంలోనే కొనసాగింది. అయితే చివరి వారం రేటింగ్ చాలా మెరుగైంది. 52వ వారం చూసుకుంటే 11.49 రేటింగ్ రావడం విశేషం. ఆరో స్థానంలో నిండు మనసులు ఉంది. దీనికి 9.45 రేటింగ్ వచ్చింది. పొదరిల్లు (7.99) 8వ స్థానానికి పడిపోయింది.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే చామంతి సీరియల్ టాప్ లో ఉంది. దీనికి 52వ వారం 8.27 రేటింగ్ నమోదైంది. ఓవరాల్ గా టాప్ 10లో చూస్తే ఏడో స్థానంలో నిలిచింది. ఇక మేఘ సందేశం (7.72), జయం (7.58) తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే టాప్ 10లో మూడు జీ తెలుగు సీరియల్స్ చోటు సంపాదించాయి. కింద టేబుల్లో టాప్ 10 సీరియల్స్ వివరాలు చూడొచ్చు.
| సీరియల్ పేరు | ఛానెల్ | టీఆర్పీ రేటింగ్ |
|---|---|---|
| కార్తీక దీపం 2 | స్టార్ మా | 14.94 |
| ఇల్లు ఇల్లాలు పిల్లలు | స్టార్ మా | 14.20 |
| గుండె నిండా గుడి గంటలు | స్టార్ మా | 12.11 |
| ఇంటింటి రామాయణం | స్టార్ మా | 11.91 |
| చిన్ని | స్టార్ మా | 11.49 |
| నిండు మనసులు | స్టార్ మా | 9.45 |
| చామంతి | జీ తెలుగు | 8.27 |
| పొదరిల్లు | స్టార్ మా | 7.99 |
| మేఘ సందేశం | జీ తెలుగు | 7.72 |
| జయం | జీ తెలుగు | 7.58 |
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


