Sign in

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మళ్లీ కొంప ముంచబోతున్న మనోజ్.. సుమతి కోసం రవి బిర్యానీ.. బాలు, మీనా ఫుల్ హ్యాపీ

గుండె నిండా గుడి గంటలు గురువారం (జనవరి 8) ఎపిసోడ్ లో బాలు, మీనా చాలా హ్యాపీగా ఉంటారు. సుమతి కోసం రవి బిర్యానీ చేయడానికి రెడీ అవుతాడు. అటు క్రెడిట్ కార్డు రూపంలో మనోజ్ మరో పెంట చేయడానికి సిద్ధమవుతుంటాడు.

Published on: Jan 8, 2026, 07:37:51 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 593వ ఎపిసోడ్ లో సత్యం ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటుంది. దీనికి కారణం సుమతి డిగ్రీలో కాలేజ్ టాపర్ గా నిలవడమే. బాలు, మీనాతోపాటు రోహిణి, రవి, శృతి కూడా ఈ వార్త విని చాలా సంతోషిస్తారు. సుమతి కోసం రవి బిర్యానీ కూడా చేస్తానంటాడు. అయితే ఎపిసోడ్ చివర్లో క్రెడిట్ కార్డు అంటూ మనోజ్ మరో కొత్త పెంట పెట్టడానికి రెడీ అవుతుంటాడు.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మళ్లీ కొంప ముంచబోతున్న మనోజ్.. సుమతి కోసం రవి బిర్యానీ.. బాలు, మీనా ఫుల్ హ్యాపీ
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మళ్లీ కొంప ముంచబోతున్న మనోజ్.. సుమతి కోసం రవి బిర్యానీ.. బాలు, మీనా ఫుల్ హ్యాపీ

పిల్లల కోసం రోహిణి ప్లాన్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (జనవరి 8) ఎపిసోడ్ తన ఫ్రెండ్ విద్యతో రోహిణి చింటు, పిల్లల గురించి మాట్లాడే సీన్ తో మొదలవుతుంది. చింటుని ఊరి నుంచి ఇక్కడికి తీసుకురావాలని అనుకుంటున్నట్లు చెప్పిన రోహిణి.. వాడిని ఇంటికి తీసుకురావాంటే మాత్రం తాను మొదట గర్భం దాల్చాలని అంటుంది. అలా జరిగితే చింటు గురించి మనోజ్ కు చెబుతానని, తనకు పిల్లలు పుట్టబోతున్నారంటే అతడు ఏమీ అనడని రోహిణి అంటుంది. దానికోసం మొదట డాక్టర్ దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది.

కాలేజ్ టాపర్‌గా సుమతి.. మీనా, బాలు సంబరం

ఇటు ఇంట్లో ఉన్న మీనాకు సుమతి ఫోన్ చేస్తుంది. తాను డిగ్రీలో కాలేజీ టాపర్ గా నిలిచానని అంటుంది. దీంతో మీనా కంట ఆనంద బాష్పాలు వస్తాయి. అది చూసిన బాలు ఏం జరిగిందని అంటాడు. ఫోన్ తీసుకొని సుమతితో మాట్లాడతాడు. తాను పాసైన విషయాన్ని సుమతి చెప్పడంతో అతడు ఎంతో సంతోషిస్తాడు. నీకు ఏం కావాలో చెప్పు తీసుకొస్తానని అంటాడు. నువ్వు, మీ అమ్మ చేసిన త్యాగాల వల్లే ఈరోజు సుమతి ఈ స్థాయికి వచ్చిందని మీనాను బాలు మెచ్చుకుంటాడు.

ప్రభావతి ఈర్శ్య.. మీనా ఎమోషనల్

వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లందరికీ చెప్పాలని అనుకుంటారు. మొదట సత్యంకు ఈ విషయం చెబుతారు. అతడు ఎంతో సంతోషిస్తాడు. మీనా చేసిన త్యాగాన్ని సత్యం కూడా కొనియాడుతాడు. ఇంతలో ప్రభావతి కూడా అక్కడికి వస్తుంది. విషయం తెలిసి అదో గొప్ప విషయమా అని కుళ్లకుంటుంది. మనోజ్ ప్రస్తావన తీసుకొస్తూ బాలు కాసేపు ఆమెతో ఆడుకుంటాడు.

అదే సమయంలో మీనా ఎమోషనల్ అవుతుంది. సుమతి, శివలను చదివించడానికి తన తల్లి ఎంత కష్టపడిందో చెబుతూ కంటతడి పెడుతుంది. అది చూసి తానేం అన్నానని ప్రభావతి అనడంతో సత్యం ఆమెను తిడతాడు.

ఎంతో సంతోషించిన రోహిణి, శృతి, రవి

అప్పుడే అక్కడికి రోహిణి, మనోజ్, రవి, శృతి కూడా వస్తారు. వాళ్లకు కూడా ఈ విషయం చెబుతారు. రోహిణి, శృతి, రవి ఎంతో సంతోషిస్తారు. సుమతి కోసం తాను బిర్యానీ చేసి పెడతానని, నువ్వు ఇవాళ రెస్ట్ తీసుకోవాలని వదినతో రవి అంటాడు. సుమతికి తాను వాచ్ గిఫ్ట్ గా ఇస్తానని శృతి చెబుతుంది. అప్పుడే మీనాకు పార్వతి ఫోన్ చేస్తుంది. తల్లీకూతుళ్లు ఇద్దరూ కాస్త ఎమోషనల్ అవుతారు. గుడికి వెళ్తున్నానని, రమ్మని చెప్పడంతో బాలు, మీనా కూడా వెళ్లడానికి రెడీ అవుతారు.

మనోజ్‌కు క్లాస్ పీకిన రోహిణి

ఇటు షాపులో డబ్బు లెక్క పెడుతున్న రోహిణికి ప్రతి రోజూ రూ.2 వేలు తక్కువగా వస్తున్నాయని తెలుస్తుంది. ఆ విషయం మనోజ్ ను అడిగితే తాను బయట తింటున్నానని, అందుకే నెలకో రూ.30 వేలు తక్కువగా వస్తున్నాయని అంటాడు. తినడానికి అంత ఖర్చు పెడతావా అంటూ అతనికి క్లాస్ పీకుతుంది రోహిణి.

అప్పుడే మనోజ్ కు రూ.10 లక్షల లిమిట్ తో క్రెడిట్ కార్డు ఇస్తామని బ్యాంకు వ్యక్తి రావడంతో అతడు ఎగిరి గంతేస్తాడు. రోహిణి వద్దని వారిస్తున్నా ఏం కాదులే అని అతడు ఆ కార్డు తీసుకోవడానికి రెడీ అవుతాడు. ఆ క్రెడిట్ కార్డుతో మనోజ్ మళ్లీ కొంప ముంచుతాడేమో అన్న ఆందోళన రోహిణిలో మొదలవుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More