గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనా, బాలును అవమానించిన చింటు అమ్మమ్మ.. ప్రభావతికి కొత్త ముప్పు
గుండె నిండా గుడి గంటలు మంగళవారం (జనవరి 6) ఎపిసోడ్ లో చింటుని దత్తత తీసుకోవాలన్న తమ ప్లాన్ పై బాలు, మీనా పని చేస్తుంటారు. అయితే వాళ్లకు చింటు అమ్మమ్మ నుంచి అవమానం ఎదురవుతుంది. ఇటు ప్రభావతికి తన డ్యాన్స్ స్టూడెంట్ ద్వారా కొత్త ముప్పు రాబోతున్నట్లు కనిపిస్తుంది.
గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 591వ ఎపిసోడ్ చింటుని దత్తత తీసుకోవాలనుకున్న బాలు, మీనా ప్లాన్.. ప్రభావతి డ్యాన్స్ స్కూల్, శృతిని రవి బతిమాలడం లాంటి సీన్లతో సాగిపోయింది. అయితే రోహిణి మరింత ఇరుక్కునే ప్రమాదం ఉండటంతో చింటు అమ్మమ్మ వాళ్లతో తెగదెంపులు చేసుకుంటుంది.

చింటుని దత్తత తీసుకోవద్దన్న మీనా
గుండె నిండా గుడి గంటలు మంగళవారం (జనవరి 6) ఎపిసోడ్ గుడిలో బాలు, మీనా.. చింటు దత్తత గురించి ఆ దేవుడినే అడిగే సీన్ తో మొదలవుతుంది. చిట్టీలు వేసి దేవత కాళ్ల దగ్గర పెట్టి ఇవ్వమంటుంది మీనా. రెండు చిట్టీల్లో ఒకటి మీనా తీస్తుంది. దత్తత తీసుకోవద్దని రావడంతో మీనా కంగారు పడుతుంది.
ఆ పని చేయొద్దని బాలుతో అంటుంది. కానీ బాలు మాత్రం దీనిని లైట్ తీసుకుంటాడు. మంచి పని చేస్తామంటే దేవుడు ఎందుకు వద్దంటాడు అని మీనాతో వాదిస్తాడు. దీని గురించి తర్వాత మాట్లాడుకుందామంటూ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
ప్రభావతి డ్యాన్స్ స్కూల్‌కు వచ్చిన స్టూడెంట్స్
ఇటు ప్రభావతి డ్యాన్స్ స్కూలుకు ఒకేసారి ఆరుగురు స్టూడెంట్స్ రావడంతో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతుంది. అయితే ఆ స్టూడెంట్స్ తో పాటు ఆమెకు ఓ కొత్త ముప్పు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. వాళ్లలో ఇద్దరు లవర్స్ కూడా డ్యాన్స్ పేరుతో అక్కడికి వస్తారు. అబ్బాయిలతో మాట్లాడితే జాగ్రత్త అని అమ్మాయికి తండ్రి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. బయటకు కలవడం కుదరడం లేదు.. ఇలా డ్యాన్స్ పేరుతో ఇద్దరం ఇక్కడే కలిసే ప్లాన్ చాలా బాగుందని ఆ లవర్స్ అనుకుంటారు. ఆ అబ్బాయి ప్రభావతికి సేవలు చేస్తూ ఆమె మెప్పు పొందడానికి ప్రయత్నిస్తుంటాడు.
శృతిని బతిమాలుకున్న రవి
ఇటు ఇంట్లో శృతిని రవి బతిమాలుకుంటాడు. డబ్బింగ్ స్టూడియోలో శృతిపై అరిచేసి వచ్చిన రవి తర్వాత కూల్ అవుతాడు. బయట తినొద్దామని అడుగుతాడు. మొదట బెట్టు చేసిన ఆమె తర్వాత సరే అంటుంది. అయితే ముందు సిటీ అంతా తిరిగి, సినిమా చూసి, తర్వాత తిని వద్దామని అనడంతో.. నీతో గొడవ పడినందుకు ఇంత ఖర్చు పెట్టిస్తావా అని రవి అంటాడు. ఎప్పుడూ ఇలా గొడవ పడుతుండు.. అలా అయితే ఇలా బయటకు తీసుకెళ్తావ్ కదా అని శృతి అతన్ని ఆటపట్టిస్తుంది.
చింటు తల్లిని తిట్టిన బాలు, మీనా
ఇటు బాలు, మీనా ఇంట్లో చింటు దత్తత గురించి ఆలోచిస్తుండగా రోహిణి, మనోజ్, సత్యం వస్తారు. తాము చింటు బర్త్ డేకు వెళ్లామని చెప్పి.. అతని తల్లి ఎలా వ్యవహరిస్తుందో సత్యంతో చెబుతారు బాలు, మీనా. అలాంటి తల్లిని ఏం చేసినా తప్పు లేదని వాళ్లు అంటారు. అటు మనోజ్ కూడా వాళ్లను సమర్థిస్తాడు. వాళ్లు అలా మాట్లాడుతుంటే ఏం చేయాలో తోచక రోహిణి అయోమయానికి గురవుతుంది.
ఆ తర్వాత ప్రభావతి ఇంటికి వస్తుంది. ఆమె ఇంటి దగ్గరికి బైక్ మీద తీసుకొచ్చి ఇంట్లోకి వచ్చి మరి వదిలి వెళ్తాడు ఆ కుర్రాడు. దీంతో ప్రభావతి తెగ మురిసిపోతుంది. అదే సమయంలో మరోసారి బాలు, మనోజ్ మధ్య కాస్త మాటామాటా పెరుగుతుంది. దీంతో మనోజ్ ను మీనా చెడామడా తిడుతుంది.
మరోవైపు చింటుని దత్తత తీసుకుంటామని వస్తే వాళ్లను గట్టిగా తిట్టి పంపించేయమని తల్లికి ఫోన్ చేసి చెబుతుంది రోహిణి. ఆ వెంటనే మీనా ఆమెకు ఫోన్ చేస్తుంది. చింటు ఫోన్ తీస్తాడు. ఆ విషయం తెలియక అతని అమ్మమ్మ.. ఇక నుంచి వాళ్లు ఫోన్ చేస్తే తీయొద్దని అని చెబుతూ వాళ్లను అవమానించేలా మాట్లాడుతుంది. అది బాలు, మీనా వింటారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


