కార్తీక దీపం 2 సీరియల్‌లో జ్యోత్స్నగా విలనిజం-ఇన్‌స్టాలో గ్లామర్ షో-గాయత్రి సింహాద్రి లేటెస్ట్ ఫొటోలు చూశారా?
తెలుగులో సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపం 2 ఫాలోవర్స్ అందరికీ జ్యోత్స్న క్యారెక్టర్ తెలిసే ఉంటుంది. నకిలీ వారసురాలిగా కార్తీక్, దీప సహా కుటుంబంతో ఆడుకుంటుంది జ్యోత్స్న. ఆ క్యారెక్టర్ ప్లే చేస్తున్న గాయత్రి సింహాద్రి ఇన్ స్టాలో గ్లామర్ షోతో ఆకట్టుకుంటోంది.
తెలుగులో ఇప్పుడు టాప్ సీరియల్స్ లో కార్తీక దీపం 2 ఒకటి. ఇందులో ఉండే ట్విస్ట్ లు, పండే ఎమోషన్ సీరియల్ ను అగ్రపథాన నడిపిస్తున్నాయి. కార్తీక దీపం 2 సీరియల్ ప్రధానంగా కార్తీక్, దీప, జ్యోత్స్న అనే మూడు క్యారెక్టర్ల చుట్టూ సాగుతోంది. జ్యోత్స్న విలనిజం పండించే అమ్మాయి. సీరియల్ లో విలన్ గా అదరగొట్టే జ్యోత్స్న బయట ఇన్ స్టాలో గ్లామర్ షోతో రెచ్చిపోతోంది.

కార్తీక దీపం 2 జ్యోత్స్న గ్లామర్ షో
గాయత్రి సింహాద్రి.. ఈ పేరు చెప్తే ఎక్కువ మందికి తెెలియకపోవచ్చు. కానీ కార్తీక దీపం 2 సీరియల్ లో విలన్ జ్యోత్స్న అని చెప్పగానే ఠక్కున గుర్తు పట్టేస్తారు. అంతలా జ్యోత్స్న క్యారెక్టర్ తో గుర్తింపు తెచ్చుకుంది గాయత్రి సింహాద్రి. సీరియల్ లో తన విలనిజంతో అదరగొడుతోంది. సీరియల్ లైఫ్ దాటి బయటకు వస్తే పర్సనల్ లైఫ్ లో హాట్ షోతో చెలరేగిపోతుంది ఈ భామ.
ఇన్ స్టా పిక్స్
గాయత్రి సింహాద్రి ఇన్ స్టా ఫొటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. గ్లామర్ షోతో ఈ భామ హీట్ పెంచేస్తోంది. చీరలోనూ క్యూట్ గా పరువాలు ప్రదర్శించేస్తోంది. సీరియల్ విలన్ జ్యోత్స్నగా నటించే గాయత్రి సింహాద్రి ఈ ఫొటోల్లో మాత్రం హీరోయిన్ గా కనిపిస్తోందనే కామెంట్లు వస్తున్నాయి.
టాప్ సీరియల్
కార్తీక దీపం 2 సీరియల్ దూసుకుపోతుంది. రేటింగ్స్ లోనూ అదరగొడుతోంది. స్టార్ మాలో రాత్రి ప్రసారమయ్యే ఈ సీరియల్ కు ఫ్యాన్స్ ఎక్కువే. ఇందులో నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్, గాయత్రి సింహాద్రి, చైత్ర, నట కుమారి, సీత, శివ నారాయణ, సురేష్ రాయ్, స్వప్న, లక్ష్మీ రాజ్, ఉషా రాణి తదితరులు నటిస్తున్నారు.
గాయత్రి సీరియల్స్
కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న క్యారెక్టర్లో అదరగొడుతున్న గాయత్రి సింహాద్రి యాక్టింగ్ అనుభవం ఎక్కువే. ఈటీవీలో వచ్చిన అత్తారింటికి దారేదీ సీరియల్ లోనూ సత్తాచాటింది గాయత్రి సింహాద్రి. జీ తెలుగులో వచ్చే త్రినయని, స్టార్ మాలోని పల్లకిలో పెళ్లి కూతురు సీరియల్స్ లోనూ మెరిసింది గాయత్రి సింహాద్రి.
కార్తీక దీపం 2 సీరియల్ లో సీరియస్ గా కనిపించే గాయత్రి సింహాద్రి బయట మాత్రం సరదాగా ఉంటుంది. సెట్స్ లో కో స్టార్స్ తో రీల్స్ చేస్తూ అల్లరి చేస్తోంది. ఇక గ్లామర్ షోతోనే ఆకట్టుకుంటోంది ఈ కార్తీక దీపం 2 సీరియల్ విలన్ జ్యోత్స్న.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


