గ్లామ‌ర్ డోస్ పెంచేసిన ఆషికా రంగ‌నాథ్‌-భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తిలో బికినీలో హాట్ ఎంట్రీ-ఇంటర్నెట్ షేక్

ఆషికా రంగనాథ్ గ్లామర్ డోస్ పెంచేసింది. భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి సినిమాలో అందాలు పరిచేసింది. ఇంట్రడక్షన్ సీన్ లో బికినీలో హాట్ ఎంట్రీతో హీట్ పెంచేసింది ఈ కన్నడ భామ.

Published on: Jan 13, 2026, 13:44:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆషికా రంగనాథ్.. నా సామిరంగా సినిమాలో నాగార్జున పక్కన చీరకట్టులో ఎంతో పద్ధతిగా కనిపించిన అమ్మాయి. కానీ భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి మూవీలో మాత్రం ఈ కన్నడ భామ గ్లామర్ డోస్ పెంచేసింది. బికినీలో ఎంట్రీతో మొదలెట్టి సినిమా అంతటా హాట్ హాట్ గా కనిపించింది. ఇప్పుడు భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తిలో ఆషికా గ్లామర్ హాట్ టాపిక్ గా మారింది.

ఆషికా రంగనాథ్
ఆషికా రంగనాథ్

భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తిలో ఆషికా

సంక్రాంతి 2026 సందర్భంగా ఇవాళ (జనవరి 13) థియేటర్లలో రిలీజైంది భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి మూవీ. దీనికి మిక్స్ డ్ టాక్ వస్తోంది. కామెడీ అదిరిపోయిందని కొందరు అంటుంటే, రొటీన్ స్టోరీ అని మరికొందరు తీసిపారేస్తున్నారు. అయితే ఈ సినిమాలో మాత్రం ఆషికా రంగనాథ్ లుక్, క్యారెక్టర్ హాట్ టాపిక్ గా మారింది. ఇంటర్నెట్ మొత్తం దీని గురించే చర్చ సాగుతోంది.

మానస శెట్టిగా

భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి సినిమాలో మానస శెట్టి అనే క్యారెక్టర్ లో అల్ట్రా మోడర్న్ అమ్మాయిగా నటించింది ఆషికా రంగనాథ్. బికినీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీలో రామ్ సత్యనారాయణ (రవితేజ)ను లవ్ చేస్తుంది ఆషికా. కానీ అప్పటికే సత్యనారాయణకు పెళ్లి అవుతుంది. ఈ విషయం మానసకు తెలియకుండా జాగ్రత్తపడతాడు.

ఆషికా సినిమాలు

కన్నడ భామ ఆషికా రంగనాథ్ 2016లో కన్నడ మూవీ క్రేజీ బాయ్ తో డెబ్యూ చేసింది. ఆ తర్వాత వరుసగా కన్నడ సినిమాలు చేసింది. 2022లో తమిళంలో అడుగుపెట్టింది. 2023లో కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అమిగోస్ తో తెలుగు తెరకు పరిచయమైంది 29 ఏళ్ల ఆషికా రంగనాథ్.

నాగ్ మూవీ

ఆ తర్వాత నాగార్జునతో నా సామి రంగా సినిమాలో మెరిసింది ఆషికా రంగనాథ్. 2024లో కన్నడలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పడు తెలుగులో భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి సినిమాలో గ్లామర్ షోతో అదరగొట్టింది. చిరంజీవి సినిమా విశ్వంభరలోనూ ఈ బ్యూటీ నటించింది. ఈ మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది.

హిట్ కోసం

తెలుగులో ఆషికాకు ఇంతవరకు సరైన హిట్ పడలేదు. అమిగోస్ పెద్దగా ఆకట్టుకోలేదు. నా సామి రంగా కూడా అంతంతమాత్రంగానే ఆడింది. ఇప్పుడు భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి మూవీకి మిక్స్ డ్ టాక్ వస్తుంది. దీంతో ఈ భామ ఆశలన్నీ ఇక చిరంజీవి అప్ కమింగ్ మూవీ విశ్వంభరపైనే ఉన్నాయి. ఆ సినిమాతోనైనా ఆషికా తెలుగులో హిట్ అందుకుంటుందేమో చూడాలి. 2026 సమ్మర్ లో విశ్వంభర రిలీజ్ అయ్యే అవకాశముంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More