కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దాసు ఎక్కడ? జ్యోపై కార్తీక్‌కు డౌట్‌- సుమిత్ర‌కు బ్ల‌డ్ క్యాన్స‌ర్ అని చెప్పేసిన జ్యోత్స్న‌

కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 16 ఎపిసోడ్ ఎమోషన్ తో నిండిపోయింది. దాసు ఎక్కడ అని కార్తీక్ ఆలోచిస్తాడు. జ్యోత్స్నపై అనుమానపడతాడు. మరోవైపు సుమిత్ర తన అనారోగ్యం గురించి ప్రశ్నిస్తుంది. ఒట్టేసి మరీ జ్యోత్స్నను నిజం చెప్పమంటుంది. సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ అని జ్యో చెప్తుంది.

Published on: Jan 16, 2026 7:00 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 16 ఎపిసోడ్ లో దాసును కిడ్నాప్ చేయించిన జ్యోత్స్న మా నాన్నను జాగ్రత్తగా చూసుకోమని రౌడీలకు చెప్తుంది. చావంటే నాకు భయం లేదు జ్యోత్స్న. ఇక మీదట బతకడానికి నువ్వు భయపడతావు. ఎలా తప్పించుకోవాలో తెలియక దొరికిపోతావు. నీ టైమ్ దగ్గర పడింది. నువ్వు జాగ్రత్త జ్యోత్స్న అని దాసు అంటాడు.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

దాసుకు ఏమైంది?

ఈ టైమ్ లో నువ్వు వెళ్లేసరికి జ్యోత్స్న అక్కడ ఉండటం ఏంటీ? అని కార్తీక్ ను దీప అడుగుతుంది. ఏదో జరిగింది. దాసు మామయ్య కచ్చితంగా తాత ఇంటికి వెళ్లాలి. కానీ అక్కడ లేడు. నా కోసం ఎదురు చూస్తున్నట్లు జ్యోత్స్న, పారిజాతం ఉన్నారు. జ్యోత్స్ననే ఏదో చేసి ఉండాలి. కానీ పారు కూడా ఉంది. కొడుకుపై ఆమెకు ప్రేమ ఉంది. పారు ఉండగా జ్యో ఏం చేయదు. దాసు మామయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని కార్తీక్ చెప్తాడు.

అత్తకు చెప్పాలని

పొద్దున కార్తీక్, దీప కలిసి శివ నారాయణ ఇంటికి వెళ్తారు. అత్తను ఈ రోజు హాస్పిటల్ కు తీసుకెళ్లాలి. అత్తకు ఇంతవరకూ హెల్త్ గురించి చెప్పలేదు. అత్తతో నువ్వు చెప్తావా దీప? ఎవరో ఒకరు చెప్పకపోతే ఎలా? అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. బావే నువ్వే మా అమ్మకు అర్థమయ్యేలా చెప్పగలవని దీప అంటుంది. సమస్య మనొకస్తే బంధాలు గుర్తుకొస్తాయి. చెప్పలేం దీప. మనం లేట్ చేసిన కొద్దీ అత్తకు సీరియస్ అవుతుందని కార్తీక్ అంటాడు.

నిజం అక్కడే

బెడ్ రూమ్ లో దగ్గుతూ సుమిత్ర ఇబ్బంది పడుతుంది. ఆమెకు అంతా మసకగా కనిపిస్తుంది. మామయ్యలా నేనూ నాటకం ఆడబోతున్నా. మామయ్యకు హెల్త్ కంప్లైంట్ ఉంది. అది చెప్పకుండా దాచనంటా. మామయ్యతో పాటు నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ కావాలి. ట్రీట్మెంట్ చేయిద్దామని చెప్తా. అక్కడే నిజం చెప్పి, ట్రీట్మెంట్ చేయించడం తేలిక అని కార్తీక్ చెప్తాడు.

హాస్పిటల్ వెళ్లాలని

మెట్ల మీద నుంచి దిగుతూ సుమిత్ర పడిపోతుంటే దీప వచ్చి పట్టుకుంటుంది. అందరూ కంగారుగా వస్తారు. ఉన్నట్లుండి దగ్గు వచ్చింది. లేచి చూస్తే కళ్లు సరిగ్గా కనిపించడం లేదు. నాకేమైందో అర్థం కాక కిందకు వచ్చానని సుమిత్ర అంటుంది. అత్తను హాస్పిటల్ కు తీసుకెళ్దామని కార్తీక్ అంటాడు. ఏం జరగనప్పుడు ఎందుకు వెళ్లడమని సుమిత్ర అంటుంది. ఇప్పుడు తగ్గిపోయినట్లే ఉంటుంది కానీ మళ్లీ వస్తుంది. హాస్పిటల్ వెళ్దాం అత్త అని కార్తీక్ అడుగుతాడు.

ఏమైందని అడిగిన సుమిత్ర

మీ మామయ్యకు హెల్త్ బాలేదని రెగ్యులర్ చెకప్ కోసం నేను వస్తే నన్ను టాబ్లెట్స్ వాడమంటున్నారు. నాకు ఎవరి మీద నమ్మకం లేదు. నేనేమైనా మంచనా పడ్డానా నాకు మీరు అందరు సేవలు చేయడానికి. ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది. చెప్పండి నాకేమైంది? కార్తీక్ నిజం చెప్పు. నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావ్? నేను భయంతో చచ్చిపోతున్నానని సుమిత్ర అంటుంది.

ముందు హాస్పిటల్ వెళ్దాం రా అత్త అని కార్తీక్ అడుగుతాడు. ఏవండీ మీరైనా చెప్పండి. నేను ఇంట్లో నుంచి వెళ్లి, తిరిగొచ్చిన తర్వాత నాపై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. కానీ ఏదో కారణం ఉందనిపిస్తుందని సుమిత్ర అడుగుతుంది. నాన్న మన ఇద్దరిని ఒకేలా చూశారు. జ్యోత్స్న మన కూతురు. కార్తీక్ మన మేనల్లుడు. ఇద్దరినీ ఒకేలా చూశాం. వాళ్లు కూడా మన క్షేమం కోరుకుంటారు. కార్తీక్ నిన్ను హాస్పిటల్ కు రమ్మంటున్నాడంటే నీ క్షేమం కోసమే కదా. అదే కాంచన అయితే వచ్చేది. నువ్వు ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నావని దశరథ అంటాడు.

చెప్పేసిన జ్యోత్స్న

మీ మాటలు వింటుంటే భయంతో చచ్చిపోతానేమో అనిపిస్తుందని సుమిత్ర అంటుంది. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నారు? మీకు ఏం కాదని దీప అంటుంది. నువ్వు నాకు చెప్పాలా? కడుపుతో ఉన్న ఆడదానివి నువ్వు. ఇంటి దగ్గర ఉండమంటే ఉన్నావా? అని సుమిత్ర ప్రశ్నిస్తుంది. నాకున్న సమస్యను ఎవరితో చెప్పించాలో నాకు తెలుసు. జ్యోత్స్న నువ్వు నా కూతురివే కదా. నా మీద ఒట్టేసి నాకు ఏం జరిగిందో చెప్పు. నాకు చెప్పలేదో నువ్వు నా కూతురు కానట్టే. కన్న కూతురివి అయితే నిజం చెప్పమని సుమిత్ర అడుగుతుంది.

ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను కన్నకూతురు కానట్టు ఒప్పేసుకున్నట్లే కదా అని జ్యో అనుకుంటుంది. చెప్తాను మమ్మీ. నీకు హెల్త్ డిసీస్ ఉంది. నీకు బ్లడ్ క్యాన్సర్ అని జ్యో చెప్పగానే సుమిత్ర షాక్ అవుతుంది. నాకు బ్లడ్ క్యాన్సర్ హా? నేను చచ్చిపోతాను. నా కూతురి పెళ్లి చూడకుండానే నేను చచ్చిపోతాను అని అరుస్తూ దగ్గుతే నోటి నుంచి రక్తం వస్తుంది. నాకు ఇంత పెద్ద వ్యాధి ఉందని చెప్పకుండా దాచారా? అని సుమిత్ర అడగడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.