కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కుండబద్దలు కొట్టిన దాసు-జ్యోత్స్న తన కూతురేనన్న నిజం బట్టబయలు-షాక్‌లో శివనారాయణ ఫ్యామిలీ
కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 14 ఎపిసోడ్ లో ట్విస్ట్ వేరే లెవల్ కు చేరుకుంది. కాశీకి బెయిల్ ఇప్పించింది తానేనని జ్యోత్స్న అబద్దం చెప్తుంది. ఇదంతా చూసిన దాసు కాశీని కొడతాడు. శివ నారాయణ ఇంటికి వెళ్లి జ్యోత్స్న నా కూతురేనని కుండ బద్దలు కొడతాడు.
కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 14 ఎపిసోడ్ లో ఎవరైనా కొత్తవాళ్లు చూస్తే దీపనే సుమిత్ర కన్న కూతురు అనుకుంటారు. ఆ బాధ జ్యోత్స్నకు లేదు. అసలు జ్యోత్స్న మా వదిన కూతురా? కాదా? నాకెక్కడో అనుమానంగానే ఉందిరా. దానిలో మా అన్నయ్య, వదిన లక్షణాలు లేవు. ఇంకా వదినకు నిజం చెప్పలేవు కదా అని కార్తీక్ తో కాంచన మాట్లాడుతుంది.

నన్ను వదిలేశావ్
రేపు చెప్పాలి. దీప నువ్వు ప్రిపేర్ గా ఉండావు. అత్తకు నిజం చెప్పినప్పుడు నువ్వు ఏడవొద్దని కార్తీక్ అంటాడు. మరోవైపు కాశీని జ్యోత్స్న కలుస్తుంది. నన్ను చాలా ప్లాన్ గా కేసులో ఇరికించి నువ్వు మాత్రం సైడ్ అయిపోయావ్. నువ్వు చెప్పకుండానే వైరా ఫుడ్ కల్తీ చేస్తాడా? అని కాశీ అడుగుతాడు. మరి ఎందుకు మీడియాకు నా పేరు చెప్పలేదని జ్యో అడుగుతుంది. నీ పేరు చెప్పినా నాకు శిక్ష తప్పదు. అదే చెప్పకుండా ఉంటే నా కోసం నిలబడతావని అనుకున్నా. కానీ వదిలేశావని కాశీ అంటాడు.
జ్యోత్స్న అబద్దం
ఎవర్రా వదిలేసింది? నేనా నువ్వా? ఆఫీస్ లో స్కామ్ చేసిన ఫైల్స్ నాకు ఇవ్వమంటే సర్ ప్రైజ్ అన్నావ్. కానీ నోరు జారి దొరికిపోయావు. లేకపోతే ఇప్పుడు జీఎంగా ఉండేవాడివి. మా తాతతో మాట్లాడి నీకు కోర్టు బెయిల్ ఇప్పించింది నేనే. నమ్మాలి తమ్ముడు. కావాలంటే మీ మామయ్యతో మాట్లాడమని జ్యో అబద్ధం చెప్తుంది. నేను ఆ ఇంట్లో అడుగుపెట్టను. స్వప్న విడాకులు ఇస్తానంటుందని కాశీ చెప్తాడు.
పోతే పోనీ తమ్ముడు, నీకు ఏం తక్కువ. ఈ కేసు నుంచి బయటపడ్డాక మనం ఓన్ గా రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం. దానికి నువ్వే సీఈఓ. ఇంతకీ ఫైల్స్ ఎక్కడున్నాయని జ్యోత్స్న అడుగుతుంది. మామయ్యకు ఎవిడెన్స్ దొరికిపోయాయి కదా అని కాశీ అనడంతో జ్యో షాక్ అవుతుంది. అక్కా టెన్షన్ పడకు వాళ్లు బయటపెట్టాలంటే ఇప్పటికే బయటపెట్టేవాళ్లు. రిలాక్స్ గా ఉండమని కాశీ చెప్తాడు. మన విషయాలు బావకు చెప్పకు. నీకు మళ్లీ పెళ్లి చేస్తానని జ్యో అంటుంది.
కాశీని కొట్టిన దాసు
జ్యోత్స్న, కాశీ మాటలను దాసు వింటాడు. జ్యో వెళ్లగానే వచ్చి కాశీని చెంపదెబ్బ కొడతాడు. తోడేళ్లతో స్నేహం చేసి నువ్వు ఓ గుంటనక్కలా తయారయ్యావ్. జ్యోత్స్న నిన్ను అవసరానికి వాడుకుంటుంది. ఈ కేసులో నిన్ను ఇరికించింది కూడా ఆమెనే. జ్యోత్స్న గురించి శివ నారాయణ దగ్గర నిజం చెప్పమని దాసు అంటాడు. నీలాంటి చేతగాని తండ్రి సహాయం నాకు అవసరం లేదు. నాకో అక్క పుట్టి చచ్చిపోయిందని చెప్తుంటావ్ కదా. నీలాంటి వాడికి కూతురుగా ఉండటం కంటే చావడం బెెటర్ అని చనిపోయిందేమోనని కాశీ అంటాడు.
నిజం చెప్పేస్తానని
నా కంటికి జ్యోత్స్న అక్క తప్ప ఎవరూ కరెక్ట్ గా కనిపించడం లేదు. నీ బతుకు నువ్వు బతుకు. నా బతుకు నేను బతుకుతానని కాశీ వెళ్లిపోతాడు. ఇక నేనిచ్చిన మాటకు కట్టుబడి ఉండలేను. జ్యోత్స్న నా కూతురే అన్న నిజాన్ని శివ నారాయణతో చెప్పేస్తానని దాసు అనుకుంటాడు. కార్తీక్ కు కాల్ చేసి నా కూతురు జ్యోత్స్న అని శివ నారాయణకు చెప్పేస్తానని దాసు అంటాడు. ఇక వాళ్లను క్షమించడం నా వల్ల కాదంటాడు. ఇది టైమ్ కాదని కార్తీక్ చెప్పినా దాసు వినకుండా కాల్ కట్ చేస్తాడు.
జ్యో బెదిరింపు
కార్తీక్ కంగారుగా వెళ్లిపోతాడు. దాసు శివ నారాయణ ఇంటికి వెళ్తాడు. జ్యో ఎదురుగా వస్తుంది. ఏంటి నాన్న నిజం చెప్పడానికి వచ్చావా? అని అడుగుతుంది. నువ్వు కాశీతో మాట్లాడటం చూశానని చెప్తుంది. తండ్రినే చంపాలనుకున్నదానివి, తమ్ముడిని వదులుతావా? వస్తువులా వాడుకుంటున్నావని దాసు అంటాడు. వాడిని ఆయుధంలా తయారు చేస్తున్నా. కాశీకి నేనే అక్కనని చెప్తే ఏం చేస్తావని జ్యో అడుగుతుంది. నీలాంటి పాపాత్మురాలు ఈ ఇంటి వారసురాలిగా ఉండటానికి పనికిరాదు. ఈ రాత్రే నిజం చెప్పాలని వచ్చానని దాసు అంటాడు.
నువ్వు నిజం చెప్పావంటే నేను చస్తానని జ్యో బెదిరిస్తుంది. ఆ పని నువ్వు చేయలేవు. అందరిని చంపుతావు కానీ నిన్ను నువ్వు ఏం చేసుకోలేవు. ఇప్పుడే నిజం చెప్పాలని వెళ్తున్న దాసు వెనకాల జ్యో వెళ్తుంది. దాసు కాళ్లు పట్టుకుంటుంది. అందరినీ పిలుస్తాడు దాసు. వదినా అని పిలిస్తే సుమిత్ర వస్తుంది.
జ్యోత్స్న నా కూతురు
నీకు ఇంత పెద్ద వ్యాధి వచ్చిందని బాధపడాలో లేక నీకు మంచి జరుగుతుందని ఆనందపడాలో అర్థం కావడం లేదు వదినా. కొన్నేళ్ల క్రితం అన్యాయం జరిగింది. నాకు కూతురు పుట్టింది. సైదులు గాడు చచ్చిపోయాడు. ఈ ఇంటి వారసురాలు చావు నుంచి తప్పించుకుని బతికి దూరంగా వెళ్లిపోయింది సార్ అని దాసు బాంబ్ పేలుస్తాడు. నా కూతురు నా కళ్ల ముందే ఉంది కదా అని సుమిత్ర అంటుంది.
జ్యోత్స్న నీ కూతురు కాదు వదిన. జ్యోత్స్న నా కూతురని నిజం చెప్పేస్తాడు దాసు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












