...
...
Next Story

రూ.200 అత్యధిక విలువ కలిగిన నోటు కానుందా? రూ.500 నోటు రద్దు చేస్తారా?

భారతీయ కరెన్సీలో రూ.200 నోటునే అత్యధిక విలువ కలిగిన నోటుగా ఉంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు కోరుకుంటున్నారు? దీనిపై సీఎం ఏం మాట్లాడారు?

Published on: Nov 10, 2026, 15:56:11 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద నోట్ల రద్దుపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో రూ. 500 నోట్లను తక్షణమే రద్దు చేయాలని, కేవలం రూ. 100, రూ. 200 నోట్లను మాత్రమే చలామణిలో ఉంచాలని ఆయన చెప్పుకొచ్చారు. డిజిటల్ కరెన్సీపై ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించిన నివేదికలో కూడా తాను ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు.

రూ.500 నోట్లు
రూ.500 నోట్లు

అమరావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నల్లధనం, అవినీతి నిర్మూలనకు పెద్ద నోట్ల రద్దు అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. 'రూ.500, రూ.1,000, రూ.2,000 నోట్లను పూర్తిగా రద్దు చేయాలి. కేవలం రూ.100, రూ.200 నోట్లను మాత్రమే మార్కెట్‌లో ఉంచాలి. సాంకేతికతను సరిగ్గా ఉపయోగిస్తే సంపద సృష్టి, పేదరిక నిర్మూలన సులభతరం అవుతాయి. నేను ఈ అంశంపై నిరంతరం మాట్లాడుతూనే ఉంటాను.' అని చంద్రబాబు తెలిపారు.

అయితే ఏపీ సీఎం చంద్రబాబు ఈ కామెంట్స్ చేయడంపై అనేక కారణాలు ఉన్నాయి. పెద్ద నోట్ల లభ్యత తగ్గితే అక్రమంగా డబ్బు నిల్వ చేయడం కష్టమవుతుంది. చిన్న నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటే ప్రజలు క్యాష్‌లెస్, డిజిటల్ లావాదేవీల వైపు వేగంగా మొగ్గు చూపుతారు. ఆర్థిక వ్యవస్థలో ప్రతి రూపాయి లావాదేవీ రికార్డు కావడం వల్ల అవినీతి తగ్గుతుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2016 నవంబర్ 8న రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ చారిత్రాత్మక నిర్ణయం జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

'నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. ఓట్ల రద్దు రాజకీయ వ్యవస్థను నాశనం చేస్తోంది. ఇవి రెండూ ప్రధాని మోదీ అందించిన కానుకలు. నోట్ల రద్దు జరిగి పదేళ్లు పూర్తయినా ప్రభుత్వం కనీసం పత్రికల్లో గానీ, హోర్డింగులపై గానీ ప్రకటనలు ఇవ్వలేదు. వేడుకలు కూడా చేసుకోలేదు. అసలు ఈ నిర్ణయం వల్ల దేశ సాధించిన ప్రయోజనాలు ఏమిటి? నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరాయా లేదా?' అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వస్తున్నాయి.

నోట్ల రద్దు తర్వాత యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు ఊహించని స్థాయిలో పెరిగాయి. ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగింది. తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీని వెనుక ఉన్న తర్కాన్ని వివరిస్తూ.. అధిక విలువ గల నగదును అరికట్టడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా అవినీతిని ఎదుర్కోవచ్చని చంద్రబాబు అన్నారు. సాంకేతికత పరిపూర్ణంగా ఉంటే, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన కష్టం కాదు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు బీజేపీలో భాగంగా ఉన్నారు. ఆయనకు రూ.500 నోటు రద్దుపై సమాచారం ఉండటం కారణంగానే.. ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లివచ్చారని, అక్కడ దానిపై కేంద్ర పెద్దలతో చర్చ జరిగి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks