ఏపీలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైన్‌షాపులు బంద్ కానున్నాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి మొదలై నవంబర్ 1వ తేదీ సాయంత్రం వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలోని అన్ని వైన్ షాపులు, బార్లు, క్లబ్‌లు మూతపడనున్నాయి.

ఓట్ల లెక్కింపు చేపట్టే నవంబర్ 3వ తేదీన కూడా పూర్తిగా మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, గొడవలు జరగకుండా ఉండేందుకే ఈ డ్రై డేస్ నిబంధనను పక్కాగా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దొంగచాటుగా మద్యం అమ్మకాలు సాగించినా, నిల్వలు ఉంచినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 1వ తేదీన నిర్వహించనున్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పోలింగ్‌కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపింది.
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, వీడియో గ్రాఫర్ల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల భద్రత కోసం మొత్తం 36,351 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. ఇందులో జిల్లాల్లో అందుబాటులో ఉన్న 32,276 మంది పోలీసు సిబ్బందితో పాటు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్(ఏపీఎస్పీ) నుంచి 2,730 మంది, ఇతర విభాగాల నుంచి 1,345 మంది సిబ్బందిని సమీకరించారు.
ఈ ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహించే పోలీసు బలగాల వివరాలు ర్యాంకుల వారీగా చూస్తే.. ఎస్పీలు – 34, అదనపు ఎస్పీలు – 52, డీఎస్పీలు – 152, సీఐలు/ఆర్ఐలు – 662, ఎస్ఐలు/ఆర్ఎస్ఐలు – 1,564, ఏఎస్ఐలు/ఏఆర్ఎస్ఐలు – 2,111, సివిల్ హెడ్ పోలీసు కానిస్టేబుళ్లు/ఏఆర్‌హెచ్‌సీలు – 4,505, సివిల్ పోలీసు కానిస్టేబుళ్లు/ఏఆర్పీసీలు – 17,017, హోంగార్డులు – 6,179 ఉన్నారు. ఇతర బందోబస్తు సిబ్బంది కూడా ఉంటారు
{{/usCountry}}ఈ ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహించే పోలీసు బలగాల వివరాలు ర్యాంకుల వారీగా చూస్తే.. ఎస్పీలు – 34, అదనపు ఎస్పీలు – 52, డీఎస్పీలు – 152, సీఐలు/ఆర్ఐలు – 662, ఎస్ఐలు/ఆర్ఎస్ఐలు – 1,564, ఏఎస్ఐలు/ఏఆర్ఎస్ఐలు – 2,111, సివిల్ హెడ్ పోలీసు కానిస్టేబుళ్లు/ఏఆర్‌హెచ్‌సీలు – 4,505, సివిల్ పోలీసు కానిస్టేబుళ్లు/ఏఆర్పీసీలు – 17,017, హోంగార్డులు – 6,179 ఉన్నారు. ఇతర బందోబస్తు సిబ్బంది కూడా ఉంటారు
{{/usCountry}}రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 4,372 పోలింగ్ స్టేషన్ లొకేషన్ల పరిధిలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వీటిలో అతి సున్నితమైన 671 కేంద్రాలకు 3,355 మంది, సున్నితమైన 1,233 కేంద్రాలకు 4,943 మంది పోలీసు సిబ్బందిని కేటాయించారు.
పోలింగ్ సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించింది.
ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరింది.