భర్త ఫ్రెండ్‌తో ఎఫైర్.. చూసి గట్టిగా క్లాస్ పీకిన అత్త.. యూట్యూబ్‌లో చూసి చంపిన కోడలు
Crime News : భర్త స్నేహితుడితో ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం అత్తకు తెలిసి మందలించింది. దీంతో ఆమెను కోడలు హత్య చేసింది.
నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపుబట్టి గ్రామంలో ఇటీవల జరిగిన మైపాటి మాధవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన మృతురాలి కోడలు పద్మశ్రీని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కావలి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమణకుమార్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.

నిందితురాలు పద్మశ్రీకి తన భర్త స్నేహితుడితో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. పద్మశ్రీ ప్రవర్తనపై అత్త మాధవి పలుమార్లు మందలించింది. వివాహేతర సంబంధం విషయం చూసి గట్టిగా చెప్పింది. అలాంటి తప్పు చేయెుద్దని హెచ్చరించింది. అయినా పద్మలో మార్పు రాకపోవడంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా నిర్వహించారు. అందరి ముందు తన తప్పును ఎత్తిచూపారన్న కోపంతో, తన సంబంధానికి అడ్డుగా ఉన్న అత్తను వదిలించుకోవాలని పద్మశ్రీ నిర్ణయించుకుంది.
మే 8వ తేదీన, పద్మశ్రీ తన తల్లి పుచ్చలపల్లి మాధవి సహాయంతో నిద్రిస్తున్న అత్తపై దిండుతో అదిమి, గొంతు నులిమి హత్య చేసింది. క్రైమ్ సీరియల్స్ ప్రభావంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. యూట్యూబ్‌లో వచ్చే క్రైమ్ సీరియల్స్ చూసి తప్పుడు మార్గాల్లో నేరాలు చేసి తప్పించుకోవచ్చని అనుకోవడం భ్రమ అని హెచ్చరించారు. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో నేరస్థులు చట్టం నుండి తప్పించుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు. యువత చెడు వ్యసనాలకు, వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఈ కేసును వేగంగా ఛేదించిన రూరల్ సీఐ శివశంకర్, ఎస్సై జంపాని కుమార్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. వీరికి రివార్డులు అందించాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని, తల్లి సాయంతో అత్తను హత్య చేసిన కోడలి ఉదంతం ఇది. సాంకేతికతను నేరాలకు కాకుండా, సన్మార్గంలో వాడాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


