రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలపై పెరిగిన నేరాలు
రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2025లో మహిళలపై గత ఏడాదితో పోలిస్తే నాలుగు శాతం నేరాలు పెరిగాయి. ఈ ఏడాది 78 శాతం కేసులను పరిష్కరించామని రాచకొండ కమిషన్ సుధీర్ బాబు వెల్లడించారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025లో మహిళలపై మొత్తం నేరాలు నాలుగు శాతం పెరిగాయి. వరకట్న హత్య, కిడ్నాప్, లైంగిక వేధింపులు, పోక్సో కేసులు గత సంవత్సరం కంటే పెరుగుదలను నమోదు చేశాయి. సోమవారం విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ జి.సుధీర్ బాబు ఈ వివరాలు వెల్లడించారు. మొత్తం 26,852 కేసులు నమోదయ్యాయని, వాటిలో 21,056 కేసులు పరిష్కరించినట్టుగా తెలిపారు. 78 శాతం పరిష్కార రేటును సాధించామని అన్నారు.

2025లో సుమారు 516 పోక్సో, 809 లైంగిక వేధింపులు, 479 కిడ్నాప్, 12 వరకట్న హత్య కేసులు నమోదు అయ్యాయి. 2025లో దాదాపు 6,188 ముందస్తు అరెస్టులు, 3734 సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయి. విజిబుల్ పోలీసింగ్, త్వరిత స్పందన, అనుమానిత షీట్ల ద్వారా పర్యవేక్షణ, నేరస్థులను అరెస్టు చేయడం వల్ల ఆస్తి నేరాలు 15 శాతం తగ్గాయి. 12 కేసుల్లో దోషులకు 20 ఏళ్లు జైలు శిక్ష పడేలా దర్యాప్తు చేశామని సుధీర్ బాబు వెల్లడించారు.
అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో సంచలనం సృష్టించిన ఒకే ఒక హత్య కేసులో దాదాపు 17 మంది నిందితులకు జీవిత ఖైదు విధించారు. లోక్ అదాలత్‌ల ద్వారా పోలీసులు 13,062 ఎఫ్‌ఐఆర్ కేసులు, 44,742 ఈ-పెట్టీ కేసులను పరిష్కరించారు. సైబర్ నేరాలకు పాల్పడిన వారిపై 3734 కేసులు నమోదు చేశామని, 6188 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. సైబర్ క్రైమ్ బాధితులకు రూ.40.10 కోట్లను రిఫండ్ చేశామన్నారు.
డ్రగ్స్ రవాణా చేస్తున్న 495 మందిని అరెస్ట్ చేసినట్టుగా సీపీ సుధీర్ బాబు చెప్పారు. రూ.20 కోట్లు విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్ట్ చేసిన వారిలో తెలంగాణకు చెందిన 322 మంది, ఇతర రాష్ట్రాల వారు 172, ఒక విదేశీయుడు ఉన్నారు. కమిషనరేట్ పరిధిలో 227 ఎన్డీపీఎస్ అనుమానిత షీట్లను తెరిచామన్నారు. నాన్‌బెయిలబుల్ వారెంట్ ఫ్రీ కమిషనరేట్‌గా రాచకొండను తీర్చిదిద్దామన్నారు రాచకొండ సీపీ సుధీర్ బాబు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


