15 ఏళ్లకే లైంగిక వేధింపులు! లక్ష్మీ మంచుకు షాకింగ్ అనుభవం.. నేనేమీ స్పెషల్ కాదు

మంచు మోహన్ బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మి తనకు జరిగిన షాకింగ్ అనుభవాన్ని వెల్లడించింది. 10వ తరగతి చదువుతున్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో తనను అసభ్యంగా తాకిన  సంఘటన ఆమె బయటపెట్టింది. 

Published on: Nov 16, 2025, 15:59:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నటి లక్ష్మీ మంచు తాజాగా చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. తాను 15 ఏళ్ల వయసులో, 10వ తరగతిలో ఉన్నప్పుడు తొలిసారిగా లైంగిక వేధింపులకు గురైనట్లు ఆమె వెల్లడించింది. హాటర్ ఫ్లైతో మాట్లాడుతూ నటుడు మోహన్ బాబు కుమార్తెగా తాను చాలా సంరక్షణతో పెరిగానని, అయితే ప్రజా రవాణాలో జరిగిన ఒక అనుభవం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె పేర్కొంది.

మంచు లక్ష్మి
మంచు లక్ష్మి

15 ఏళ్ల వయసులో

ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ మాట్లాడుతూ తాను 10వ తరగతిలో, కేవలం 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తొలిసారిగా వేధింపులకు గురైనట్లు తెలిపింది. మోహన్ బాబు కుమార్తెగా తాను సాధారణంగా డ్రైవర్, బాడీగార్డ్ లేదా తల్లితో పాటు స్కూల్‌కు వెళ్లేదాన్నని ఆమె పేర్కొన్నారు. అయితే ఒకసారి హాల్ టికెట్లు తీసుకోవడానికి స్కూల్ నుంచి వాళ్లను పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అయిన బస్ లో తీసుకెళ్లింది. ఆ సమయంలో తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని ఆమె గుర్తు చేసుకుంది. కానీ దారిలో కొందరు అపరిచితులు తనను అనుచితంగా తాకారని లక్ష్మీ తెలిపింది.

చిన్న పిల్లనని తెలుసా?

“నేను ఎదుర్కొన్న ఈ వేధింపులు, ఈ అసహ్యకరమైన అనుభూతి ఏమిటి? అప్పుడు నాకు 15 ఏళ్లు. నేను ఒక చిన్న పిల్లనని వారికి తెలుసో లేదో నాకు తెలియదు. నేను దూరంగా జరిగిపోయా. గొడవ పడలేదు. నా స్నేహితురాళ్లతో ఈ విషయం పంచుకున్నా. వారికీ ఇలాగే జరిగిందని చెప్పారు. దీనికోసం నన్ను ప్రత్యేకంగా ఎంచుకోలేదు. నేను స్పెషల్ కాదు. ఇది అందరికీ జరుగుతుంది” అని మంచు లక్ష్మి వెల్లడించింది.

కన్నీళ్లు

ఇంటర్వ్యూలో లక్ష్మీ మాట్లాడుతూ దురదృష్టవశాత్తు ఇలాంటి సంఘటనలు చాలా సాధారణమని, ప్రజా రవాణాలో ప్రయాణించిన ఏ అమ్మాయి అయినా తనకు ఇలా జరగలేదని చెబితే అది అబద్ధమేనని చెప్పింది. మహిళా కమిషన్ విడుదల చేసిన కరపత్రంలో పేర్కొన్న ప్రతి విషయం తనకు జరిగిందని, అందుకే మీటూ ఉద్యమం సమయంలో తాను ఏడుస్తూ కుప్పకూలిపోయానని పేర్కొంది.

“కొన్నిసార్లు పెద్ద కుటుంబం నుండి వచ్చిన వారిని ఇబ్బంది పెట్టాలని కొందరు కోరుకుంటారు. ఎందుకంటే మనం బయటకు వచ్చి చెప్పము. నా ఇంట్లో దొంగతనం జరిగితే, నేను బయటకు వచ్చి చెప్పలేను. ఆ 15,000 రూపాయలు పోతే పోనివ్వండని అనుకునేలా పెంచారు నన్ను. బయటకు వచ్చి చెప్పలేమన్నారు’’ అని లక్ష్మి తెలిపింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More