Yogandhra 2026 registrations : రాష్ట్రంలో యోగాను ఒక ప్రజా ఉద్యమంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన 'యోగాంధ్ర-2026' కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రారంభం కాగా… జూన్ 9వ తేదీ నాటికి ఏకంగా ఐదు లక్షల మైలురాయిని చేరుకోవడం విశేషం. ప్రారంభించిన తొలిరోజు కేవలం 25 వేల మంది మాత్రమే నమోదు చేసుకోగా…. సోమవారం నుంచి ఈ సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా యోగాసనాల్లో కోటి మందిని భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు రూపొందించిన 'యోగాంధ్ర' పోర్టల్ ద్వారా ఈ నమోదు ప్రక్రియ వేగంగా సాగుతోంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న సానుకూల వాతావరణం, ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తిని బట్టి చూస్తే త్వరలోనే కోటి మంది రిజిస్ట్రేషన్ల లక్ష్యం సులువుగా నెరవేరుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ముందంజలో గుంటూరు…
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి మద్దతు లభిస్తోంది. ఇప్పటివరకు జరిగిన నమోదు వివరాల ప్రకారం, అత్యధికంగా గుంటూరు జిల్లాలో 98 వేల మంది తమ పేర్లను పోర్టల్‌లో నమోదు చేసుకుని ప్రథమ స్థానంలో నిలిచారు. గుంటూరు తర్వాత నెల్లూరు, నంద్యాల, కర్నూలు, పల్నాడు జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని ఆయుష్ (AYUSH) డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. వివిధ యోగా అసోసియేషన్లు, గ్రామ మరియు వార్డు సచివాలయాల సిబ్బంది, ఇతర స్వచ్ఛంద సంస్థల చురుకైన మద్దతుతో ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ విస్తృతంగా సాగుతోంది.
లక్ష్యాన్ని దాటిన యోగా మాస్టర్ ట్రైనర్ల నమోదు
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల కంటే ఎక్కువ మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5,600 మంది యోగా మాస్టర్ ట్రైనర్ల పేర్లను నమోదు చేయించాలని ప్రభుత్వం భావించగా…. ఇప్పటికే ఆ సంఖ్య 6,939కు చేరుకోవడం గమనార్హం.
వాస్తవానికి ప్రతి జిల్లా నుంచి కనీసం 200 మంది ట్రైనర్లను సిద్ధం చేయాలని ప్రభుత్వం జిల్లాల యంత్రాంగానికి సూచించింది. అయితే, వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 412 మంది, అనకాపల్లిలో 379 మంది, అనంతపురంలో 342 మంది, కర్నూలు జిల్లాలో 310 మంది మాస్టర్ ట్రైనర్లు ఇప్పటికే యోగాంధ్ర పోర్టల్‌లో చేరిపోయారు.
{{/usCountry}}వాస్తవానికి ప్రతి జిల్లా నుంచి కనీసం 200 మంది ట్రైనర్లను సిద్ధం చేయాలని ప్రభుత్వం జిల్లాల యంత్రాంగానికి సూచించింది. అయితే, వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 412 మంది, అనకాపల్లిలో 379 మంది, అనంతపురంలో 342 మంది, కర్నూలు జిల్లాలో 310 మంది మాస్టర్ ట్రైనర్లు ఇప్పటికే యోగాంధ్ర పోర్టల్‌లో చేరిపోయారు.
{{/usCountry}}మరోవైపు…. క్షేత్రస్థాయిలో శిక్షణ ఇచ్చే యోగా ట్రైనర్ల కేటగిరిలో 2.5 లక్షల మందిని భాగస్వాములను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే 1.88 లక్షల మంది ట్రైనర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ విభాగంలోనూ వైఎస్సార్ కడప జిల్లా 9,013 మంది ట్రైనర్ల నమోదుతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రభుత్వం ఖరారు చేసిన ప్రణాళికల ప్రకారం జిల్లాల్లో యోగాసనాల కార్యక్రమాలు, థీమ్ బేస్డ్ ఈవెంట్లు, రకరకాల పోటీలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఆయుష్ విభాగం తెలిపింది.
జూన్ 21న జరగబోయే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 56 ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తి గల వారు రాష్ట్రంలోని అన్ని గ్రామ/వార్డు సచివాలయాలలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీటి పర్యవేక్షణ కోసం ఆయుష్ విభాగానికి చెందిన అధికారులను ఒక్కో జిల్లాకు ఒకరి చొప్పున నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. ఇక https://yogandhra.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి కూడా పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.