ఎన్నికల కమిషన్ (ఈసీఐ) పనితీరుపై ప్రజాస్వామ్యంలో నమ్మకం కలగాలంటే దాని నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాలని వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కోసం ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)లతో కూడిన ముగ్గురు సభ్యుల నిష్పాక్షిక కమిటీని పునరుద్ధరించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఆ నివేదికతో తలెత్తిన అనుమానాలు

ఎలక్షన్ కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో ఓటర్ల జాబితాలు, డేటాబేస్ ప్రాసెస్, ఈసీనెట్ (ECINet) నిర్వహణపై దాదాపు 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన కథనాన్ని వైఎస్ జగన్ ప్రస్తావించారు. ఈ పరిణామాలు ప్రజల్లో అనేక సందేహాలకు తావిస్తున్నాయని ఎక్స్ (X) వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.
"రాజకీయ ఆరోపణలు-ప్రత్యారోపణల కంటే ప్రజలకు స్పష్టత అవసరం. ఓటర్ల జాబితాల్లో పేర్ల చేరిక, తొలగింపు లేదా పునరుద్ధరణ ప్రక్రియల్లో ఏ రకమైన అభ్యంతరాలు నమోదయ్యాయి, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది పారదర్శకంగా తెలియజేయాలి" అని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థే ఎగ్జామినర్‌ను ఎన్నుకుంటే ఎలా?
"విద్యార్థే తన ఎగ్జామినర్‌ను ఎన్నుకునే విధానం ఎంత నిజాయితీగా ఉన్నా విమర్శలకు దారితీస్తుంది. అందుకే ఆ స్థానంలో తటస్థంగా ఉండే వ్యక్తులు ఉండటమే సరైన పద్ధతి. ఈసీ నియామకాలపై చట్టాన్ని సవరించి, సీజేఐ భాగస్వామ్యంతో ప్యానెల్ ఏర్పాటు చేస్తేనే వ్యవస్థపై ప్రజలకు మళ్లీ విశ్వసనీయత పెరుగుతుంది" అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
2023లో తీసుకొచ్చిన ఈసీ నియామకాల చట్టానికి గతంలో వైఎస్సార్సీపీ మద్దతు ఇచ్చినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ చట్టాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏపీ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై విమర్శలు
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓటర్ల సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అధికార పక్షం తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రతిపక్షంగా తమ విజ్ఞప్తులను, స్థానిక సంస్థల ఎన్నికల డివిజన్ల పునర్విభజనపై వ్యక్తం చేసిన అభ్యంతరాలను అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని అన్నారు.
ఈసీఐ వివరణ ఏంటంటే..
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓటర్ల సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అధికార పక్షం తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రతిపక్షంగా తమ విజ్ఞప్తులను, స్థానిక సంస్థల ఎన్నికల డివిజన్ల పునర్విభజనపై వ్యక్తం చేసిన అభ్యంతరాలను అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని అన్నారు.
ఈసీఐ వివరణ ఏంటంటే..
{{/usCountry}}మరోవైపు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదికపై భారత ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్పందించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం, బహుళ సభ్యుల రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఈసీఐ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తుందని తెలిపింది. నిర్ణయాల రూపకల్పన సమయంలో సభ్యులు రాతపూర్వక నోట్లు ఇవ్వడం, అంతర్గత పరిశీలనలు చేయడం సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమేనని, ఈసీ జారీ చేసే ప్రతి ఉత్తర్వుకు పూర్తి చట్టబద్ధత ఉంటుందని స్పష్టం చేసింది.