మున్సిపల్ ఎన్నికల పోలింగ్ : పులివెందుల ఆర్వో ఆఫీసు వద్ద ఉద్రిక్తత - వైసీపీ ఏజెంట్లతో కలిసి వైఎస్ జగన్ బైఠాయింపు

వైసీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి అనుమతించడంలేదని ఆరోపిస్తూ పులివెందుల ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 70 మంది ఏజెంట్లతో కలసి నిరసనకు దిగారు. 

Published on: Nov 1, 2026, 13:41:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కడప జిల్లా పులివెందులలో స్థానిక సంస్థల పోలింగ్ వేళ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పులివెందుల రిటర్నింగ్ అధికారి (RO) కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని, తమ పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఆయన ఈ ఆందోళన చేపట్టారు.

పులివెందుల ఆర్వో ఆఫీసు వద్ద జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసు వద్ద జగన్ బైఠాయింపు

ఆర్వో ఆఫీస్ ముందు నిరసన….

ఈ రోజు ఉదయం పులివెందుల క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరిన వైఎస్ జగన్… నేరుగా ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన వెంట సుమారు 70 మంది వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లు కూడా ఉన్నారు. అయితే, భద్రతా కారణాలు మరియు నిబంధనలను బూచిగా చూపుతూ అధికారులు జగన్ బృందాన్ని ఆర్వో ఆఫీసు లోపలికి అనుమతించలేదు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్, దానికి నిరసనగా కార్యాలయం ప్రాంగణం ముందే బైఠాయించి ఆందోళన ప్రారంభించారు.

అనేక ప్రాంతాల్లో తమ పార్టీ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, పోలింగ్ కేంద్రాల్లోకి రానివ్వకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని ఆటంకాలు సృష్టిస్తున్నారని వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో ఇటువంటి అక్రమాలు సరికాదని, తక్షణమే నిబంధనల ప్రకారం వైఎస్సార్‌సీపీ ఏజెంట్లందరినీ బూత్‌లలోకి అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్వో ఆఫీసు వద్ద జగన్ బైఠాయించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. స్థానికంగా ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More