రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖలో వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు లాగేసుకున్నారని విమర్శించారు. ఏపీలో ప్రభుత్వ పాలనను చంద్రబాబు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారనడంలో ఎలాంటి సందేహం లేదని దుయ్యబట్టారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వ భూములను లాగేసుకున్నారు - వైఎస్ జగన్

“హలో ఇండియా… ఇది ఒక వేక్-అప్ కాల్. విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు , ఆయన కుటుంబం దాదాపు రూ.5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేసుకుంది. రుషికొండ సమీపంలో ఉన్న 54.79 ఎకరాల అత్యంత విలువైన భూములను అధికార దుర్వినియోగం ద్వారా బహిరంగంగానే కబ్జా చేసేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, అత్యంత విలువైన ఈ భూమిని తన సొంత కుటుంబ సభ్యుడైన విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్‌కు కట్టబెట్టేశారు” అని వైెఎస్ జగన్ ఆరోపించారు.
“వైయస్సార్‌సీపీ ప్రభుత్వ కాలంలో తిరిగి స్వాధీనం చేసుకుని…. ఫెన్సింగ్ వేసిన భూములను ఇప్పుడు మళ్లీ చంద్రబాబు తన కుటుంబానికి ఉచితంగా బహుమానంగా ఇచ్చేశారు. ఈ విలువైన భూములను లోకేష్ తన తోడల్లుడికి కట్టబెట్టడం, చంద్రబాబు కుటుంబ కుట్రను బయటపెడుతోంది. లోకేష్‌కు ఎలాంటి అధికార పరిధి లేకపోయినా, విద్యాశాఖ నుంచి ఒక మెమో జారీ చేసి ఈ భూములను తన తోడల్లుడికి కేటాయించేలా చేశారు.ఆ తర్వాత చంద్రబాబు ఒత్తిళ్లు, బెదిరింపులతో నగర పాలక సంస్థ సభ్యుల (గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్స్)ను భయపెట్టి ఏకపక్షంగా ఆమోదించుకున్నారు" అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు వైయస్సార్‌సీపీ కార్పొరేటర్లు ధైర్యంగా నిలబడితే, వారిపై భౌతిక దాడులు చేసి బలవంతంగా బయటకు తోసేశారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడుల్లో పలువురు వైయస్సార్‌సీపీ కార్పొరేటర్లు గాయపడగా, పోలీసులు పట్టించుకోకుండా ప్రేక్షకపాత్ర పోషించారని విమర్శించారు.
{{/usCountry}}ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు వైయస్సార్‌సీపీ కార్పొరేటర్లు ధైర్యంగా నిలబడితే, వారిపై భౌతిక దాడులు చేసి బలవంతంగా బయటకు తోసేశారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడుల్లో పలువురు వైయస్సార్‌సీపీ కార్పొరేటర్లు గాయపడగా, పోలీసులు పట్టించుకోకుండా ప్రేక్షకపాత్ర పోషించారని విమర్శించారు.
{{/usCountry}}“ఈ భూ దోపిడీని అమలు చేయడానికి చంద్రబాబు, బీసీ యాదవ వర్గానికి చెందిన వైయస్సార్‌సీపీ మహిళా మేయర్‌ను తొలగించారు, కార్పొరేటర్లను కొనుగోలు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు, ప్రజాస్వామ్య ప్రక్రియను బుల్డోజ్ చేసి రూ.5,000 కోట్ల విలువైన ఆస్తిని తన కుటుంబ సభ్యులకు కానుకగా ఇచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ ప్రభుత్వ ఆస్తులు మాయమవుతాయి. వారి కుటుంబ ఆస్తులు పెరుగుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఒక పరిపాటిగా జరిగిపోతుంది. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు ప్రభుత్వ పాలనను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు” అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు.