తన కుమార్తె అంజిలి రెడ్డి వివాహం, యలహంక ఆస్తి వివాదంపై వైఎస్ షర్మిల స్పందించారు. "నాది కాని దాని కోసం ఆశపడే నీచత్వం నాది కానే కాదు," అని ఆమె స్పష్టం చేశారు. వైఎస్సార్ ఆస్తుల పంపకాలు, యలహంక ప్యాలెస్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో ఆమె… ట్విట్టర్ (X) ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
నా భాగానికే వచ్చింది….

ఆస్తుల పంపకాలపై వస్తున్న వార్తలపై షర్మిల స్పష్టతనిచ్చారు. "వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత…. అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న బెంగళూరులోని యలహంక ప్రాపర్టీని ఆస్తుల పంపకాల్లో భాగంగా పూర్తిగా 100 శాతం నా, నా పిల్లల భాగానికే కేటాయించారు. ఇది దేవుడి సాక్షిగా పచ్చి నిజం," అని ఆమె వెల్లడించారు.
తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకాలు ఉన్న ఇంట్లోనే బిడ్డ పెళ్లి జరిపించాలని భావించినట్లు షర్మిల తెలిపారు. "నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న వైఎస్సార్ తిరిగిన ఇల్లు కావడం వల్ల, నా కుమార్తె అంజిలి కోరిక మేరకు తన వివాహాన్ని అదే ఇంట్లో జరిపించాలని భావించాం. మన తెలుగు సంస్కృతిలో సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు దక్కే గొప్ప అదృష్టం. కానీ, తాను చిన్నప్పటి నుంచి పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోతున్నందుకు తల్లిగా చాలా బాధపడుతున్నాను" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కళ్యాణ వేదిక మార్పు
వివాహ వేదిక మార్పునకు గల కారణాలను వివరిస్తూ, "పెళ్లి వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక వందనాలు. నా కుమార్తె అంజిలి పెళ్లి పెద్దలు కుదిర్చిన సంబంధం. ఎలాంటి వివాదాలు, గొడవలు లేకుండా ఈ వివాహాన్ని ప్రశాంతంగా జరిపించాల్సిన పూర్తి బాధ్యత మాపై ఉంది. అందుకే వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం" అని వైెఎస్ షర్మిల ప్రకటించారు.
{{/usCountry}}వివాహ వేదిక మార్పునకు గల కారణాలను వివరిస్తూ, "పెళ్లి వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక వందనాలు. నా కుమార్తె అంజిలి పెళ్లి పెద్దలు కుదిర్చిన సంబంధం. ఎలాంటి వివాదాలు, గొడవలు లేకుండా ఈ వివాహాన్ని ప్రశాంతంగా జరిపించాల్సిన పూర్తి బాధ్యత మాపై ఉంది. అందుకే వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం" అని వైెఎస్ షర్మిల ప్రకటించారు.
{{/usCountry}}కాబోయే నవదంపతులు అంజిలి, రఘురామ్ రెడ్డిలకు తెలుగు ప్రజలందరి ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని వైఎస్ షర్మిల ఆకాంక్షించారు. షర్మిల ప్రకటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.