'ఆశపడే నీచత్వం నాది కాదు.. ఆ ప్రాపర్టీ పూర్తిగా నాదే - వైఎస్ షర్మిల

కుమార్తె అంజిలి వివాహ వేదిక మార్పుపై వైఎస్ షర్మిల స్పందించారు. యలహంక ఇల్లు 100 శాతం తన భాగానికే వచ్చిందని స్పష్టం చేస్తూనే, వివాదాలకు దూరంగా ఉండటానికే పెళ్లి వేదికను మారుస్తున్నట్లు ప్రకటించారు.

Published on: Oct 31, 2026, 11:14:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తన కుమార్తె అంజిలి రెడ్డి వివాహం, యలహంక ఆస్తి వివాదంపై వైఎస్ షర్మిల స్పందించారు. "నాది కాని దాని కోసం ఆశపడే నీచత్వం నాది కానే కాదు," అని ఆమె స్పష్టం చేశారు. వైఎస్సార్ ఆస్తుల పంపకాలు, యలహంక ప్యాలెస్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో ఆమె… ట్విట్టర్ (X) ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఆస్తి వివాదంపై వైఎస్ షర్మిల ట్వీట్
ఆస్తి వివాదంపై వైఎస్ షర్మిల ట్వీట్

నా భాగానికే వచ్చింది….

ఆస్తుల పంపకాలపై వస్తున్న వార్తలపై షర్మిల స్పష్టతనిచ్చారు. "వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత…. అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న బెంగళూరులోని యలహంక ప్రాపర్టీని ఆస్తుల పంపకాల్లో భాగంగా పూర్తిగా 100 శాతం నా, నా పిల్లల భాగానికే కేటాయించారు. ఇది దేవుడి సాక్షిగా పచ్చి నిజం," అని ఆమె వెల్లడించారు.

తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకాలు ఉన్న ఇంట్లోనే బిడ్డ పెళ్లి జరిపించాలని భావించినట్లు షర్మిల తెలిపారు. "నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న వైఎస్సార్ తిరిగిన ఇల్లు కావడం వల్ల, నా కుమార్తె అంజిలి కోరిక మేరకు తన వివాహాన్ని అదే ఇంట్లో జరిపించాలని భావించాం. మన తెలుగు సంస్కృతిలో సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు దక్కే గొప్ప అదృష్టం. కానీ, తాను చిన్నప్పటి నుంచి పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోతున్నందుకు తల్లిగా చాలా బాధపడుతున్నాను" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కళ్యాణ వేదిక మార్పు

వివాహ వేదిక మార్పునకు గల కారణాలను వివరిస్తూ, "పెళ్లి వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక వందనాలు. నా కుమార్తె అంజిలి పెళ్లి పెద్దలు కుదిర్చిన సంబంధం. ఎలాంటి వివాదాలు, గొడవలు లేకుండా ఈ వివాహాన్ని ప్రశాంతంగా జరిపించాల్సిన పూర్తి బాధ్యత మాపై ఉంది. అందుకే వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం" అని వైెఎస్ షర్మిల ప్రకటించారు.

కాబోయే నవదంపతులు అంజిలి, రఘురామ్ రెడ్డిలకు తెలుగు ప్రజలందరి ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని వైఎస్ షర్మిల ఆకాంక్షించారు. షర్మిల ప్రకటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More