మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ : గవర్నర్‌కు కోటి సంతకాల కాపీ అందజేత - కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్

వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పోరాటం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్… 1 కోటి సంతకాల కాపీని గవర్నర్ కు సమర్పించారు. కోటి సంతకాల ఉద్యమాన్ని గవర్నర్‌కు వివరించారు.

Published on: Dec 18, 2025, 20:56:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

10 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గురువారం లోక్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ కు కోటి మందికి పైగా సంతకాలను సమర్పించారు. కోటి సంతకాల ఉద్యమాన్ని గవర్నర్‌కు వివరించారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలను సేకరించినట్లు తెలిపారు.

వైసీపీ నేతలతో జగన్
వైసీపీ నేతలతో జగన్

వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ గత కొంతకాలంగా పోరాడుతోంది. ఇందులో భాగంగా ప్రజల నుంచి కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి సేకరణకు శ్రీకారం చుట్టింది. జగన్ ఆదేశాల మేరకు… ఈ కార్యక్రమం పూర్తికాగా సేకరించిన కాపీల వివరాలను గవర్నర్ కు అందజేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్…. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చామన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించితే కలిగే నష్టాలను వివరించామని తెలిపారు.అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు జరిగిన సంతకాల సేకరణకు అద్భుతమైన స్పందన వచ్చందన్నారు.

దేశంలోనే అతిపెద్ద కుంభకోణం - వైఎస్ జగన్

వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దేశంలో అతిపెద్ద కుంభకోణం అని వైెఎస్ ఆరోపించారు. ప్రభుత్వ నిధులతో జీతాలు చెల్లిస్తూనే వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం మరో పెద్ద కుంభకోణమన్నారు.

“మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం పెద్ద స్కామ్. ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వమే జీతం చెల్లిస్తుంది.. కానీ నిర్వహణ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటుంది. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేరా?.. ఖర్చు చేయకపోతే మెడికల్‌ కాలేజీలను అలానే వదిలేయండి.. మేం అధికారంలోకి వచ్చాక పూర్తిచేస్తాం. మాకు క్రెడిట్ వస్తుందేమోనని పేదలకు నష్టం చేయడం సరికాదు. సీఎం చంద్రబాబు కొత్త స్కామ్‌లు సృష్టిస్తున్నారు. వైజాగ్‌కు తలమానికంగా రిషికొండ భవనాన్ని రూ.250 కోట్లతో నిర్మించాం. చంద్రబాబు ఒక్కరోజు యోగా కార్యక్రమానికి రూ.300 కోట్లు ఖర్చు చేశారు” వైఎస్ జగన్ ఆరోపించారు.

ఇక సంతకాల సేకరణను పూర్తి చేయటంలో కీలకంగా పని చేసిన పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, కన్వీనర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్య కర్తలు, గ్రామస్థాయి కార్యకర్తలను వైఎస్ అభినందించారు. "1.4 కోట్లకు పైగా సంతకాల సేకరించటం ఓ చరిత్ర అని… ఈ సంతకాలు లోక్ భవన్ కు సమర్పించాం" అని చెప్పారు

2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని వైఎస్ జగన్ ఆరోపించారు. "ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అన్న వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. పాఠశాలలు ఆసుపత్రులను కూడా నడపలేని పరిస్థితులు ఉన్నాయి. ఫలితంగా ప్రైవేట్ దోపిడీ పెరుగుతోంది "అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల ఆందోళనలను అధికారికంగా నమోదు చేసేలా సంతకాలను కూడా కోర్టుకు సమర్పిస్తామని వైఎస్సార్ సీపీ అధినేత జగన్ తెలిపారు. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వం ఒక్కో జిల్లాలో ఒక్కొక్కటిగా… మొత్తం 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించి ఏడు మెడికల్ కాలేజీలను పూర్తి చేసిందని జగన్ గుర్తు చేశారు. ప్రస్తుత ఎన్డీయే కూటమి అధికారంలోకి రాకముందే ఐదు కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభమయ్యాయని చెప్పారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More