తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార యంత్రాంగం దుర్వినియోగానికి పాల్పడకుండా, అభ్యర్థులకు బెదిరింపులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) కోరింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు మూడు వేర్వేరు లేఖలు రాశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు అభ్యర్థులకు, ఓటర్లకు పూర్తి రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నామినేషన్ల కేంద్రాల వద్ద ప్రత్యేక రక్షణ

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, ప్రతిపాదకులు, పోలింగ్ ఏజెంట్లకు టీడీపీ శ్రేణుల నుంచి ముప్పు పొంచి ఉందని లేళ్ల అప్పిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నామినేషన్ కేంద్రాలు, సున్నితమైన పోలింగ్ స్టేషన్లు, స్ట్రాంగ్ రూమ్‌లు, లెక్కింపు కేంద్రాల వద్ద నిరంతరం సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. వీలైన చోటల్లా ప్రత్యక్ష ప్రసారం (లైవ్ వెబ్‌కాస్టింగ్) నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక హెల్ప్‌లైన్, స్వతంత్ర పరిశీలకులు, మొబైల్ నిఘా బృందాలను రంగంలోకి దించాలని పేర్కొన్నారు.
మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నేరుగా జిల్లా కలెక్టరేట్లలో లేదా అధికారిక ఎన్నికల అధికారుల వద్ద నామినేషన్లు వేసే వెసులుబాటు కల్పించాలని అప్పిరెడ్డి కోరారు. "స్థానిక నామినేషన్ కేంద్రాల వద్ద దాడులు, అడ్డంకులు సృష్టించే ప్రమాదం ఉన్నందున జిల్లా కేంద్రాల్లో అదనపు నామినేషన్ సౌకర్యం కల్పించాలి. అక్కడి నుంచి పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సురక్షితంగా పంపేలా ఏర్పాట్లు చేయాలి. ప్రతి అభ్యర్థికి భయపడకుండా పోటీ చేసే హక్కును కాపాడాలి" అని ఆయన స్పష్టం చేశారు.
సీఏపీఎఫ్ దళాల మోహరింపునకు డిమాండ్
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకముందే కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (సీఏపీఎఫ్) రాష్ట్రంలో మోహరించాలని అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు. స్థానిక పోలీసుల నిష్పాక్షికతపై తమకు నమ్మకం లేదని, బలవంతపు ఉపసంహరణలు, నామినేషన్ల అడ్డుకట్టలను నివారించాలంటే కేంద్ర బలగాల పర్యవేక్షణే మార్గమని ఆయన లేఖలో వివరించారు.
ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారు: వడ్డి రఘురామ్
మరొక పత్రికా సమావేశంలో వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ వడ్డి రఘురామ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విధానాల వల్ల రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు. ప్రభుత్వం ఆక్వా మేత తయారీ కంపెనీలకు కొమ్ముకాస్తూ పేద రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఎస్ఏడీఏ) చట్టాన్ని కూటమి ప్రభుత్వం బలహీనపరుస్తోందని పేర్కొన్నారు.
{{/usCountry}}మరొక పత్రికా సమావేశంలో వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ వడ్డి రఘురామ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విధానాల వల్ల రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు. ప్రభుత్వం ఆక్వా మేత తయారీ కంపెనీలకు కొమ్ముకాస్తూ పేద రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఎస్ఏడీఏ) చట్టాన్ని కూటమి ప్రభుత్వం బలహీనపరుస్తోందని పేర్కొన్నారు.
{{/usCountry}}“గత ఆరు నెలల్లో ఆక్వా ఫీడ్ ధరను రూ.27 పెంచితే, ప్రభుత్వం కేవలం రూ.1.50 రాయితీ ఇస్తూ గొప్పలు చెప్పుకుంటోంది. జూన్, జులై నెలల్లో రైతులకు కరెంట్ సబ్సిడీ ఎందుకు నిలిపివేశారో సమాధానం చెప్పడం లేదు" అని వడ్డి రఘురామ్ నిలదీశారు. కౌలు రైతులు పంట విరామం (క్రాప్ హాలిడే) ప్రకటించే స్థితికి వచ్చారని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆక్వా రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.