అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతున్న రూ.7 కోట్ల దేవాదాయ శాఖ ఉద్యోగాల కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సన్నిహితులు కోట రుక్మిణి, కేకే శ్రీనివాస్‌లను కూటమి ప్రభుత్వం రక్షిస్తోందని, ఈ వ్యవహారంలో ధరణి కృష్ణను బలిపశువును చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ఆరోపించారు. శనివారం (నవంబర్ 21) తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఒక్క ఉద్యోగి ఇదంతా చేయగలరా?

ఈ కుంభకోణంలో అసలు సూత్రధారులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని నాగార్జున యాదవ్ విమర్శించారు. "నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వేతనం పొందే ఒక ఉద్యోగి ఒంటరిగా ప్రభుత్వ రాజముద్రలు, డిజిటల్ సంతకాలను ఫోర్జరీ చేయడం ఎలా సాధ్యం? 2025 నాటి తేదీలతో నియామక పత్రాలు, వేలిముద్రలతో కూడిన సర్వీస్ బుక్‌లను తయారు చేసి, ఏపీ దేవాలయాల వెబ్‌సైట్‌లో కెల్లా అప్పారావు పేరును గ్రేడ్-3 ఈవో అధికారిగా ఎలా నమోదు చేయగలరు?" అని యాదవ్ ప్రశ్నించారు.
పెద్దిరాజు అరెస్టు తర్వాత ఈ కేసుతో జనసేనకు ఎలాంటి సంబంధం లేదని సీఐడీ పేర్కొనడాన్ని ఆయన సవాలు చేశారు. తమ శాఖకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని దేవాదాయ శాఖ కమిషనర్ చేసిన ప్రకటనపైనా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు.
ధరణిపై నిర్బంధం.. పోలీసుల తీరుపై ప్రశ్నలు
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎంఎల్‌సీ (మెడికో-లీగల్ కేసు) నివేదికను ప్రస్తావిస్తూ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. "నవంబర్ 13 నుంచి మూడు రోజుల పాటు ధరణిని అక్రమంగా నిర్బంధించి బెల్టులతో కొట్టారు" అని ఆయన ఆరోపించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదును పెనమలూరు పోలీసులు స్వీకరించడానికి ఎందుకు నిరాకరించారని నిలదీశారు. "తన ప్రాణాలకు ముప్పు ఉందని, పవన్ కల్యాణ్ నగదు పెట్టె తాళాలు తన వద్ద ఉన్నాయని" ధరణి చేసిన వ్యాఖ్యలపై లోతుగా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
బ్యాంకు ఖాతాలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలి
ఉద్యోగాల పేరుతో మోసపోయిన 36 మంది బాధితులను తక్షణమే గుర్తించి, నగదు లావాదేవీల వివరాలను (మనీ ట్రయల్) బహిర్గతం చేయాలని యాదవ్ కోరారు. మొత్తం ఎంత వసూలైంది, ఆ సొమ్ము ఎవరికి చేరిందనే నిజాలు బయటపడాలంటే కైరెన్ (Kyren) సంస్థకు చెందిన మంగళగిరి, లండన్ బ్యాంకు ఖాతాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం కుంభకోణం వెనుక ఉన్న అక్రమాలను వెలికితీయాలంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించడం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.
రూ.10 కోట్ల నోటీసుపై సవాల్
{{/usCountry}}ఉద్యోగాల పేరుతో మోసపోయిన 36 మంది బాధితులను తక్షణమే గుర్తించి, నగదు లావాదేవీల వివరాలను (మనీ ట్రయల్) బహిర్గతం చేయాలని యాదవ్ కోరారు. మొత్తం ఎంత వసూలైంది, ఆ సొమ్ము ఎవరికి చేరిందనే నిజాలు బయటపడాలంటే కైరెన్ (Kyren) సంస్థకు చెందిన మంగళగిరి, లండన్ బ్యాంకు ఖాతాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం కుంభకోణం వెనుక ఉన్న అక్రమాలను వెలికితీయాలంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించడం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.
రూ.10 కోట్ల నోటీసుపై సవాల్
{{/usCountry}}కోట రుక్మిణి తనకు పంపిన రూ.10 కోట్ల పరువు నష్టం నోటీసును యాదవ్ తోసిపుచ్చారు. కేవలం రూ.లక్ష ప్రారంభ మూలధనంతో ఏర్పాటైన ఆమె కంపెనీకి, రూ.10 కోట్ల పరువు నష్టం నోటీసు పంపడానికి పొంతన ఏమిటని ఎద్దేవా చేశారు. ఆమెకు నిజంగానే నిజాయతీ ఉంటే ఈ వ్యవహారంపై సీబీఐ లేదా ఈడీ విచారణ కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయాలని సవాలు విసిరారు.
తనపై 18 కేసులు నమోదై, జైలు శిక్ష అనుభవించినప్పటికీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని యాదవ్ తేల్చిచెప్పారు. "నిరుద్యోగ యువత పక్షాన మా పోరాటం కొనసాగుతుంది. బెదిరింపులకు, ఆన్‌లైన్ వేధింపులకు వైఎస్సార్‌సీపీ భయపడదు" అని ఆయన స్పష్టం చేశారు.
ABOUT THE AUTHOR
ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.