...
...
Next Story

ఏపీ స్థానిక ఎన్నికలు : వైసీపీ జాబితా విడుదల - లిస్టులో 5 మేయర్, 17 మంది మున్సిపల్ ఛైర్మన్‌ అభ్యర్థులు

YSRCP Candidates List : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్మన్ అభ్యర్థుల జాబితాను వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. ఈ మేరకు జగన్ ఆమోదంతో… పేర్లతో కూడిన లిస్టును విడుదల చేశారు.

Published on: Oct 17, 2026, 10:35:10 IST
Advertisement

YSRCP Candidates List : ఏపీలో స్థానిక ఎన్నికల సమరం మొదలైంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ షురూ కాగా… మరోవైపు ప్రధాన పార్టీలు అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వైసీపీ కూడా జాబితాను రిలీజ్ చేసింది. వివిధ మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థులతో పాటు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఛైర్మన్ అభ్యర్థుల పేర్లు ఇందులో ఉన్నాయి. సామాజిక సమీకరణాలు, రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టినట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి.

మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థులు:

  • విజయవాడ : రాయన భాగ్యలక్ష్మి (జనరల్)
  • గుంటూరు: తాడికొండ అలవేలు వెంకట నాగ పద్మశ్రీదేవి (జనరల్ - మహిళ)
  • తిరుపతి: యెచ్చం వాసుదేవ యాదవ్ (జనరల్)
  • కర్నూలు: ఉతకళ్ల సుశీల (ఎస్సీ - మహిళ)
  • అనంతపురం: చిట్లూరు రమేష్ గౌడ్ (బీసీ)
  • చిత్తూరు: రామస్వామి చంద్రశేఖర్ (బీసీ)

మున్సిపాలిటీ ఛైర్మన్ అభ్యర్థులు :

  • బొబ్బిలి: తుమ్మల అచ్చుతవల్లి (జనరల్ - మహిళ)
  • సాలూరు: బావిరెడ్డి రిబికా రాణి (బీసీ - మహిళ)
  • అమలాపురం: దూడల విరీతాదేవి (జనరల్)
  • జంగారెడ్డిగూడెం: మేకా సత్యవతి (బీసీ - మహిళ)
  • నూజివీడు: కంచర్ల లవకుమార్ (ఎస్సీ)
  • జగ్గయ్యపేట: షేక్ హఫీజున్నీసా (జనరల్ - మహిళ)
  • పెదనా: కటకం నాగకుమారి (జనరల్ - మహిళ)
  • నాయుడుపేట: తాంబిరెడ్డి రాజేశ్వరమ్మ (జనరల్ - మహిళ)
  • సూళ్లూరుపేట: మోది విమల కుమార్ (ఎస్సీ - మహిళ)
  • ఎమ్మిగనూరు: కొడిగంటి శివన్న రఘు (జనరల్)

నగర పంచాయతీ ఛైర్మన్ అభ్యర్థులు:

  • పాలకొండ: పాలవలస ఇందుమతి (బీసీ - మహిళ)
  • ముమ్మిడివరం: సనబోయిన సునీలాదేవి (బీసీ - మహిళ)
  • నందిగామ: చల్లా బ్రహ్మేశ్వరరావు (జనరల్)
  • గిద్దలూరు: భూమా నరసింహారెడ్డి (జనరల్)
  • అద్దంకి: వుడత్తు సురేష్ (జనరల్)
  • చీమకుర్తి: మేడగం శ్రీదేవి (జనరల్)
  • దర్శి: వెన్నాపూస వెంకటరెడ్డి (జనరల్)

వైఎస్సార్‌సీపీ మున్సిపల్ అభ్యర్థుల జాబితా విడుదల
వైఎస్సార్‌సీపీ మున్సిపల్ అభ్యర్థుల జాబితా విడుదల
 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks